Friday, January 17, 2025

వాళ్ల ఆటను నేను ఆస్వాదించా: రోహిత్ శర్మ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కుర్రాలతో ఆడటం తనకు సంతోషాన్ని ఇచ్చిందని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. ఇంగ్లాండ్ సిరీస్‌లో వాళ్లతో ఆడడాన్ని ఆస్వాదించానని చెప్పారు. అరంగ్రేటం భావోద్వేగాన్ని కలిగించిందని పేర్కొన్నారు. ఇంగ్లాండ్ సిరీస్‌లో రజత్ పాటీదర్, ధ్రువ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్, ఆకాశ్ దీప్, దేవ్‌దూత్ పడిక్కల్ తన అంతర్జాతీయ కెరీర్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. కుర్రాళ్లు చాలా తుంటరులు అని, వాళ్లలో చాలా మంది తనకు తెలుసునని, వారి బలాలు, వాళ్లు ఎలా ఆడాలనుకుంటారో బాగా తెలుసునని వివరించారు. గతంలో వారు జాతీయ స్థాయిలో రాణించడంతో ఎంత గొప్ప ఆటగాళ్లో  తెలిసిందన్నారు. వాళ్లు స్పందించిన తీరు అద్భుతంగా ఉందన్నారు. వాళ్లు ఆడుతుండగా తల్లిదండ్రుల కళ్లలో భావోద్వేగం గొప్పగా అనిపించిందని తెలియజేశారు. తాను కుర్రాడిగా ఉన్నప్పుడు లీగ్‌లో సర్ఫరాజ్ ఖాన్‌ తండ్రితో కలిసి ఆడానని వివరణ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News