Thursday, January 23, 2025

యాపిల్ నుంచి నాకూ హ్యాకింగ్ మెసేజ్ వచ్చింది: ఎక్స్‌లో మంత్రి కెటిఆర్

- Advertisement -
- Advertisement -

ప్రతిపక్ష నాయకులపై దాడి చేయడానికి బిజెపి ఎంతకైనా దిగజారుతుందని

తెలుసు కాబట్టి, నాకు ఎలాంటి ఆశ్చర్యం కలుగలేదు

మనతెలంగాణ/హైదరాబాద్ : ‘ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే హ్యాకర్లు మీ ఫోన్ హ్యాక్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు’ అని తన ఫోన్‌కు కూడా యాపిల్ నుంచి హ్యాకింగ్ అలర్ట్ మెసేజ్ వచ్చిందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. ఈ మేరకు మంత్రి కెటిఆర్ మంగళవారం ఎక్స్(ట్విటర్)లో తనకు యాపిల్ నుంచి వచ్చిన మెసేజ్‌ను పోస్టు చేశారు. ప్రతిపక్ష నాయకులపై దాడి చేయడానికి బిజెపి ఎంతకైనా దిగజారుతుందని తమకు తెలుసు కాబట్టి, తనకు ఎలాంటి ఆశ్చర్యం కలుగలేదని అన్నారు.

KTR tweet

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News