Friday, November 22, 2024

అరుదైన గౌరవంగా భావిస్తా

- Advertisement -
- Advertisement -

ముంబై: టీమిండియా ప్రధాన కోచ్‌గా తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించానని రవిశాస్త్రి పేర్కొన్నాడు. సుదీర్ఘ కాలం భారత క్రికెట్‌కు కోచ్‌గా కొనసాగడాన్ని అరుదైన గౌరవంగా భావిస్తానని స్పష్టం చేశాడు. ఓ అంతర్జాతీయ వార్తా పత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో రవిశాస్త్రి ఈ విషయాలు వెల్లడించాడు. కోచ్‌గా తన ప్రయాణం ఎంతో సంతృప్తికరంగా సాగిందన్నాడు. తన హయాంలో టీమిండియా ఎన్నో చిరస్మరణీయ విజయాలను సొంతం చేసుకున్న విషయాన్ని గుర్తు చేశాడు. ఇక త్వరలో జరిగే టి20 వరల్డ్‌కప్‌లో భారత్ ట్రోఫీని సాధిస్తే తనకంటే అదృష్టవంతుడు మరోకరూ ఉండరని పేర్కొన్నాడు. తన పర్యవేక్షణలో భారత్ రెండు సార్లు ఆస్ట్రేలియాలో విజయాలు సాధించిందన్నాడు. అంతేగాక ఇంగ్లండ్‌ను వారి సొంత గడ్డపై ఓడించిందన్నాడు.
త్వరలో జరిగే టి20 వరల్డ్‌కప్‌లో డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్‌కే ట్రోఫీని గెలిచే అవకాశాలు అధికంగా ఉన్నాయని భారత మాజీ క్రికెటర్ సబా కరీం జోస్యం చెప్పాడు. ఇతర జట్లతో పోల్చితే విండీస్‌లోనే అత్యధిక సంఖ్యలో టి20 స్పెషలిస్ట్‌లు ఉన్నారన్నాడు. పొలార్డ్, గేల్, బ్రావో, హోల్డర్, రసెల్ తదితరులతో విండీస్ చాలా బలంగా ఉందన్నాడు. ఇక భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లను కూడా తక్కువ అంచనా వేయలేమన్నాడు.

I honoured to be retained as coach: Ravi Shastri

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News