- Advertisement -
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ నూతన కార్యవర్గానికి అభినందనలు తెలిపారు పవన్‌స్టార్ పవన్‌కళ్యాణ్. “తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి నూతన కార్యవర్గానికి హృదయపూర్వక అభినందనలు. అధ్యక్షులుగా ఎన్నికైన ప్రముఖ నిర్మాత శ్రీ దిల్ రాజు, ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులు, కోశాధికారి, సెక్టార్ కౌన్సిల్ చైర్మన్లు, కార్యనిర్వాహక కమిటీ సభ్యులు మండలి కార్యకలాపాలను విజయవంతంగా ముందుకు తీసుకువెళ్తారని ఆకాంక్షిస్తున్నాను. ఒక సినిమా నిర్మితమవుతోందంటే వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కలుగుతుంది. రూ.కోట్ల సంపద సృష్టి జరుగుతుంది. పన్నులు చెల్లిస్తారు. తెలుగు సినిమా స్థాయి వాణిజ్యపరంగా రోజురోజుకీ విస్తృతమవుతోంది. కాబట్టి పరిశ్రమ తలెత్తుకొని నిలిచేలా ఫిల్మ్ ఛాంబర్ నూతన కార్యవర్గం పని చేస్తుందని ఆశిస్తున్నాను”అని పవన్ తెలిపారు.
- Advertisement -