న్యూఢిల్లీ: 80వ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల సందర్భంగా ప్రముఖ దర్శకుడు ఎస్‌ఎస్. రాజమౌళి లాస్ ఏంజెల్స్‌లో సినిమా లెజెండ్ స్టీవెన్ స్పీల్‌బర్గ్‌ను కలుసుకున్నారు. గోల్డెన్ గ్లోబ్స్‌లో స్టీవెన్ స్పీల్‌బర్గ్ చిత్రం ‘ది ఫాబెల్‌మాన్స్’ రెండు అవార్డులు..ఉత్తమ చిత్రం(డ్రామా), ఉత్తమ దర్శకుడు అవార్డులను గెలుచుకుంది. కాగా రాజమౌళి చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’ ఆంగ్లేతర చిత్రం విభాగంలో ఉత్తమ పాట(నాటు నాటు…) విభాగంలో గెలిచింది. రాజమౌళి స్పీల్‌బర్గ్‌తో ఉన్న చిత్రాలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘నాటు నాటు..’పాటను స్పీల్‌బర్గ్ సైతం మెచ్చుకున్నారని ట్వీట్ చేశారు. ‘నాకు నచ్చింది’ అని మాత్రమే ఆయన అన్నారన్నారన్నారు.
I just met GOD!!! ❤️🔥❤️🔥❤️🔥 pic.twitter.com/NYsNgbS8Fw
— rajamouli ss (@ssrajamouli) January 14, 2023
ఇక ఎంఎం. కీరవాణి ‘నాటు నాటు..’ పాటకు స్వరకల్పన చేశారు. ఆయన కూడా స్పీల్‌బర్గ్‌తో దిగిన ఫోటోను ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. ‘సినిమా దేవుడిని కలుసుకున్నాను. ‘డ్యూయెల్’ వంటి ఆయన సినిమాలను ఇష్టపడ్డానని ఆయన చెవిలో చెప్పాను’ అని రాశారు.
Had the privilege of meeting the God of movies and say in his ears that I love his movies including DUEL like anything ☺️☺️☺️ pic.twitter.com/Erz1jALZ8m
— mmkeeravaani (@mmkeeravaani) January 14, 2023
And I couldn’t believe it when he said he liked Naatu Naatu ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🙏🙏 pic.twitter.com/BhZux7rlUK
— mmkeeravaani (@mmkeeravaani) January 14, 2023