పుణె: ఎలాంటి ఒత్తిడిని అయినా ఎదుర్కొనే సత్తా తనకుందని టీమిండియా సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ పేర్కొన్నాడు. అంతేగాక సవాళ్లకు ఎదురీదడం అంటే తనకు చాలా ఇష్టమన్నాడు. ఇక ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో కీలక ఇన్నింగ్స్ ఆడడం పెద్ద ఊరటనిచ్చిందన్నాడు. జట్టు యాజమాన్యం తనపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టినందుకు గర్వంగా ఉందన్నాడు. ఇక ఎలాంటి పిచ్‌లు ఉన్నా దాని ప్రభావం తన బ్యాటింగ్‌పై పడదన్నాడు. ఒత్తిడిని తట్టుకుని బ్యాటింగ్ ఎలా చేయాలో తనకు బాగా తెలుసన్నాడు. సుదీర్ఘ క్రికెట్ కెరీర్‌లో ఒత్తిడిని తట్టుకుని ఎలా ముందుకు పోవాలో బాగా నేర్చుకున్నానన్నాడు. ఇక రానున్న మ్యాచుల్లో కూడా రాణించి జట్టు విజయాల్లో తనవంతు పాత్ర పోషించడమే లక్షంగా పెట్టుకున్నానన్నాడు. ఇక ఐపిఎల్ కోసం ప్రత్యేక ప్రణాళిక ఏమీలేదన్నాడు. జట్టు ప్రయోజనాలకు అనుగుణంగా ఆడడమే తన లక్షమన్నాడు. మరోవైపు తుది జట్టులో స్థానం లభించినా లభించక పోయినా తాను పెద్దగా బాధపడనని ధావన్ స్పష్టం చేశాడు. ఒకవేళ తనకు ఛాన్స్ లభిస్తే దాన్ని సద్వినియోగం చేసుకునేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తానని తెలిపాడు.
I know how to handle pressure: shikhar dhawan