Sunday, February 23, 2025

మనీష్ మిస్ ఓ లాస్ బర్త్ డే నడుమ కేజ్రీవాల్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి , ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ బుధవారం తన జన్మదినం నేపథ్యంలో తన సహచర మంత్రి మనీష్ సిసోడియాను గుర్తు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆయన తనతో లేకపోవడం కొట్టొచ్చే లోటు అని కేజ్రీవాల్ స్పందించారు. లిక్కర్ స్కామ్ కేసులో సిసోడియా జైలులో ఉన్నారు. తనకు పలు వర్గాల నుంచి జన్మదిన శుభాకాంక్షలు అందుతున్నాయని,

ఇందుకు వారందరికి తాను ధన్యవాదాలు తెలియచేస్తున్నానని చెప్పిన కేజ్రీవాల్ మనీష్‌ను మిస్సయ్యానని చెప్పారు. తప్పుడు కేసులతో ఆయనను జైలు పాలుచేశారని కేజ్రీవాల్ తెలిపారు. ఆయన పటిష్ట భారతదేశం కోసం పాటుపడ్డారని అన్నారు. పుట్టిన ప్రతిబిడ్డకు నాణ్యమైన విద్యను ప్రసాదించాలనే మహత్తర ఆలోచనలు ఆయనవి అని తెలిపారు. అంతకు ముందు ఢిల్లీ అసెంబ్లీ కేజ్రీవాల్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News