Friday, January 17, 2025

ఇప్పట్లో ఆ ఆలోచన లేదు..

- Advertisement -
- Advertisement -

టీమిండియా సారథి రోహిత్ శర్మ
ధర్మశాల: క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించే ఆలోచన ఇప్పట్లో లేదని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పష్టం చేశాడు. ప్రస్తుతం తాను పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నానని, బ్యాటింగ్ కూడా బాగానే చేస్తున్నానని తెలిపాడు. ఇలాంటి స్థితిలో రిటైర్మెంట్ గురించి ఆలోచించే ప్రసక్తే లేదన్నాడు. ఇక తాను క్రికెట్‌లో కొనసాగలేనని అనిపించిన క్షణంలోనే ఆట నుంచి తప్పుకుంటానని పేర్కొన్నాడు. అప్పటి వరకు క్రికెట్‌ను ఆస్వాదిస్తానని వివరించాడు. ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్ తన కెప్టెన్సీ కెరీర్‌లో చాలా అరుదైనదన్నాడు. సీనియర్లు లేకున్నా యువ ఆటగాళ్ల మద్దతుతో ఇంగ్లండ్ వంటి బలమైన టీమ్‌పై 41 తేడాతో సిరీస్ గెలవడం గర్వంగా ఉందని రోహిత్ పేర్కొన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News