- మంత్రి చామకూర మల్లారెడ్డి
- సొంత నిధులతో గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు
ఘట్‌కేసర్: నియోజకవర్గం ప్రజలు తనను ఎమ్మెల్యేను చేస్తే, ముఖ్యమంత్రి కేసిఆర్ మంత్రిని చేశారని, నేను ఎంత సంపాదించిన మీకే వస్తది కాబట్టి అందులో నుండి నియోజక వర్గాల ప్రజలకు ఇవ్వాలని, నా కుమారులతో కలిసి ప్రతి గ్రామంలో సొంత నిధులతో పలు కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఘట్‌కేసర్ మండలం ప్రతాప్ సింగారం గ్రామం పరిధిలోని డబుల్ బెడ్ రూమ్ సమీపంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్మిస్తున్న శ్రీ కంఠమహేశ్వర స్వామి ఆలయ నిర్మాణాకి, ఎస్సీ కమ్యూనిటి హాల్ నిర్మాణానికి, మసీద్ ప్రహారి, పురాతనమైన నవభారతి యువజన సంఘం భవన నిర్మాణానికి, సొంత నిధులతో చేపట్టే పనులకు స్థానిక సర్పంచ్ వంగూరి శివశంకర్‌తో కలిసి కొబ్బరికాయలు కొట్టారు.
ఈ సందర్భంగా సర్పంచ్ ఆధ్వర్యంలో డప్పు వాయిధ్యాలతో మంత్రికి ఘన స్వాగతం పలికారు. చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నవభారతి యువజన సంఘం భవనంలో జరిగిన సమావేశంలో మంత్రి పాల్గొని పై విధంగా ప్రజలకు వివరించారు. తను ఎమ్మెల్యేగా గెలిచి నాలుగు ఏళ్ళు గడిచిందని, ఇందులో రెండు సంత్సరాలు కరోనాతో పోరాడడానికే సరిపోయిందని, గత ఏడాదిన్నర నుండి అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని తెలిపారు.
ఎన్నికలు ఐదు నెలలు ఉన్నాయని, సర్పంచ్‌లకు 6 నెలలు ఉన్నాయని, రాజకీయాలకతితంగా ముందుకు సాగుదామని కోరారు. ఎన్నికల సమయంలో రాజకీయాలు చేయాలని, తర్వాత అందరు కలిసి అభివృద్ధి కోసం కృషి చేసినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. సమావేశం ప్రారంభం సమయంలో సర్పంచ్ శివశంకర్ మాట్లాడుతూ మంత్రి సొంత నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టటడం సంతోషకరమైన విషమని, గ్రామంలో సొంత నిధులతో చేపడుతున్న కార్యక్రమాలతో పాటు ముదిరాజులకు మూడెకరాల ప్రభుత్వ భూమిలో చెరువు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ పార్టీ నియోజకవర్గం నాయకులు చామకూర భద్రారెడ్డి, దర్గా దయాకర్ రెడ్డి, కొంతం అంజిరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు నాగులపల్లి రమేష్, ప్రధాన కార్యదర్శి పన్నాల కొండల్ రెడ్డి, ఉపాధ్యక్షుడు బద్దం కుమార్, సర్పంచ్‌లు ఓరుగంటి వెంకటేష్ గౌడ్, కొంతం వెంకట్‌రెడ్డి, గ్రామ ఉపసర్పంచ్ అబేద భేగం, వార్డు సభ్యులు కొరుబోతు గోవర్ధన్, బండిరాల లలిత, సుధాకర్, దంతూరని మురళి కృష్ణ, గౌడ సంఘం నాయకులు జున్ను సత్తయ్య గౌడ్, గండి నర్సింహా, ఓరుగంటి శ్రీను, కొండల్, రాములమ్మ, జున్ను స్వామి గౌడ్,బాలరాజు గౌడ్, తదితర నాయకులు పాల్గొన్నారు.