Thursday, January 23, 2025

హాఫ్ మారథాన్‌లో నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నా మరి మీరు..

- Advertisement -
- Advertisement -
  • హాఫ్ మారథాన్‌లో నేను పాల్గొంటున్న మీరు పాల్గొనాలి
  • రిజిస్ట్రేషన్ చేసుకున్న మంత్రి హరీశ్‌రావు

సిద్దిపేట: సిద్దిపేట రంగనాయక సాగర్ వద్ద ఆగస్టు 6న జరిగే హాఫ్ మారథాన్‌కు మంత్రి హరీశ్‌రావు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మాట్లాడుతూ మన సిద్దిపేట వేదికగా మరో అద్భుతమైన కార్యక్రమం జరుపుకోబోతున్నామన్నారు. సిద్దిపేట పట్టణంలోని రంగనాయక సాగర్ వద్ద ఆగస్టు 6న హాఫ్ మారథాన్ రన్నింగ్ కార్యక్రమం రాష్ట్రంలోనే తొలిసారిగా నిర్వహిస్తున్నామని తెలిపారు. మన ఆరోగ్యం మన చేతలలోనే ఉంటుందన్నారు. రన్నింగ్ అనేది మన ఆరోగ్యం లో దినచర్యగా భావించాలన్నారు. ప్రజల ఆ రోగ్యం వై పు దృష్టి పెంచుకోవడానికి హాఫ్ మారథాన్ నిర్వహిస్తున్నామని ఇం త మంచి కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రన్నింగ్‌పై ఆసక్తి గలవారు యువత, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని సిద్దిపేట ఆఫ్ మారథాన్‌ను విజయవంతం చేయాలని అందుకు నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. మరి మీరు చేసుకున్నారా వెంటనే చేసుకొండి ఈ రోజే చివరి అవకాశమన్నారు. అందరూ చేసుకోండి.. హాఫ్ మారథాన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. https:// shm23. iq301.com/ఈ లింక్‌ను క్లీక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News