Wednesday, December 25, 2024

ప్రభాస్ సినిమాలో నటించా.. కానీ చెప్పకుండానే తీసేశారు: రకుల్

- Advertisement -
- Advertisement -

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో తాను నటించానని.. కానీ ఆ సినిమా నుంచి తనను తీసేశారని హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఆవేదన వ్యక్తం చేసింది. ప్రభాస్‌ మూవీ నుంచి తనను తొలగించడం బాధించిందని తెలిపింది.

తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ లో రకుల్ మాట్లాడుతూ.. “ప్రభాస్ సినిమా కోసం నన్ను సెలక్ట్ చేశారు. నాలుగు రోజులు షూటింగ్ కూడా చేశా. షూటింగ్ షెడ్యూల్ ముగిసిన తర్వాత ఢిల్లీ వెళ్లా. ఆ తర్వాత ఆ ప్రాజెక్ట్ నుంచి నాకు ఎలాంటి అప్డేట్ రాలేదు. నా స్థానంలో వేరొకరిని తీసుకున్నట్లు ఆ తర్వాత తెలిసింది. కనీసం నాకు సమాచారం కూడా ఇవ్వకుండా సినిమా నుంచి తొలగించారు. ప్రభాస్‌తోనే చేయాల్సిన మరో మూవీ షూటింగ్ ఇప్పటికీ ప్రారంభం కాలేదు’ అని తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News