Monday, December 23, 2024

రెండు ప్రపంచ యుద్ధాలు, రష్యా దాడిని తట్టుకున్నది ఈ బామ్మ!

- Advertisement -
- Advertisement -

 

Nazi concentration camp survivor Anastasia Gulej. (AP Photo/Steffi Loos)(AP)

న్యూఢిల్లీ:  ఆమెకు ఇప్పుడు 96 ఏళ్లు. ఆమె పేరు అనస్తాసియా గులేజ్. రెండో ప్రపంచ యుద్ధం కాలంలో అన్నే ఫ్రాంక్‌తో కలిసి పోలాండ్‌లోని ఆష్విట్జ్ నిర్బంధ శిబిరంలో ఖైదీగా గడిపింది. ప్రస్తుతం తన స్వదేశమైన ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న దాడిని ఆమె ఖండించింది. ఉక్రెయిన్‌పై రష్యా సైనికులు దాడులు మొదలెట్టడంతో ఆమె ఫిబ్రవరిలో జర్మనీకి పారిపోయింది. అయితే ఆమె రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ పేర్కొన్న ‘మారణహోమం’ను విమర్శించింది. తాను స్టాలినిజం కాలంలో నియంతలైన అడాల్ఫ్ హిట్లర్, జోసఫ్ స్టాలిన్ మారణహోమం నుంచే బయటపడ్డానని, ఇప్పుడు పుతిన్ తలపెట్టిన (బండబూతు తిడుతూ) యుద్ధం నుంచి కూడా బయటపడతానని తెలిపింది. బ్రిటిష్, కెనడియన్ దళాలు జర్మనీలోని బెర్గెన్‌బెల్సెన్ నిర్బంధ శిబిరాన్ని విముక్తి చేసిన 77వ వార్షికోత్సవం సందర్భంగా ఈ నెలారంభంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.“క్రెమ్లిన్‌లోని హిట్లర్ ఆరాధకులు బుచా, మారియుపోల్‌లో ఏమి చేశారో చెప్పడానికి నా దగ్గర మాటలు లేవు” అని ఆమె చెప్పినట్లు మెయిల్ ఆన్‌లైన్ పేర్కొంది.
ఆష్విట్జ్ రెండో ప్రపంచ యుద్ధం కాలంలో నాజీలచే నిర్వహించబడిన అతిపెద్ద నిర్బంధ కేంద్రం. 1939 సెప్టెంబర్‌లో నాజీలు పోలాండ్‌పై దాడి చేసిన తర్వాత దీనిని నిర్మించారు. నివేదికల ప్రకారం యూదులు, యుద్ధ ఖైదీలతో సహా 10లక్షల మంది కంటే ఎక్కువ మందే ఈ ఆష్విట్జ్‌లో చంపబడ్డారు. ఆమె ఇప్పటికీ ఉక్రెయిన్‌లో నివసించాలని కోరుకుంటోంది. ప్రస్తుతం కుమారుడు వాసిల్, కుమార్తె వాలెంటినాతో కలిసి జర్మనీలో ఉంది. ఆమె ఉక్రెయిన్ నుంచి తప్పించుకోడానికి ఆమె జర్మన్ స్నేహితులు సహకరించారు.
ఇదిలావుండగా ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ గుటెర్రస్ గురువారం బుచా, ఉక్రెయిన్‌లోని ఇతర యుద్ధ తాకిడి ప్రాంతాలను సందర్శించారు. బుచాలో విలేకరులతో మాట్లాడుతూ యుద్ధ నేరాల విచారణలో అంతర్జాతీయ కోర్టుకు(ఐసిసి) రష్యా సహకరించాలన్నారు. 21వ శతాబ్దిలో ఈ యుద్ధం ‘అసంబద్ధమైనది, చెడ్డది, నేరపూరితమైనది’ అని ఆయన పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News