Friday, December 20, 2024

ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్‌తో సంగీతం!

- Advertisement -
- Advertisement -

విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ డెన్ నుండి ’శారీ’ అనే చిత్రం రాబోతోంది. పాన్ ఇండియా మూవీగా తెలుగు, హిందీ, తమిళ, మళయాళ భాషల్లో ఈ చిత్రాన్ని నవంబర్ లో విడుదల చేయనున్నారు. గిరి కృష్ణకమల్ దర్శకత్వంలో ‘శారీ’ని ఆర్జీవీ ఆర్వీ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో ప్రముఖ వ్యాపారవేత్త రవి వర్మ ఈ చిత్రాన్ని నిర్మించారు. సత్య యాదు, ఆరాధ్య దేవి హీరో హీరోయిన్లుగా నిజ జీవిత సంఘటనలతో సైకలాజికల్ థ్రిల్లర్‌గా ‘శారీ’ మూవీ రూపొందుతోంది.

‘శారీ’ సినిమాతో రామ్ గోపాల్ వర్మ భారతీయ చలన చిత్ర చరిత్రలో ఫస్ట్ టైం ఏఐ లేటెస్ట్ టెక్నాలజీని మ్యూజిక్ డిపార్ట్‌మెంట్‌లో ప్రయోగించారు. అదెలా అంటే సంగీత ప్రపంచంలోనూ ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ (కృతిమ మేధ) సప్తస్వరాలతో విన్యాసాలు చేస్తూ మ్యూజిక్ డైరెక్టర్స్‌కే కాదు, పాటల రచయితలకు సింగర్స్‌కు సమానంగా సవాల్ చేస్తుంది. ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ పక్రియతో ‘శారీ’ చిత్రంలోని ‘ఐ వాంట్ లవ్‘ అనే లిరికల్ వీడియో సాంగ్ విడుదల చేసి సినిమా చరిత్రలో మరో అధ్యాయాన్ని రాశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News