Friday, December 27, 2024

నన్ను లైంగికంగా వేధించారు

- Advertisement -
- Advertisement -
మాజీ మంత్రి నారాయణపై తమ్ముడి భార్య ఫిర్యాదు

హైదరాబాద్ : తనను లైంగికంగా వేధించారని మాజీ మంత్రి నారాయణపై ఆయన తమ్ముడి భార్య కృష్ణ ప్రియ సంచలన ఆరోపణలు చేశారు. ఆ మేరకు ఆమె వీడియో కూడా విడుదల చేశారు. తాజాగా ఆమె ఈ విషయంపై పోలీసులను ఆశ్రయించారు. ఆదివారం హైదరాబాద్ రాయదుర్గం పోలీసు స్టేషన్‌కు వెళ్లిన ప్రియ మాజీమంత్రి నారాయణపై ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రి నారాయణ తనను లైంగికంగా వేధిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా నారాయణపై ప్రియ ఇన్‌స్టాగ్రామ్‌లో పలు వీడియోలు విడుదల చేస్తున్నారు. నారాయణ తనను వేధిస్తున్నారని, వీడియోలు విడుదల చేసిన తర్వాత ఆ వేధింపులు మరింత ఎక్కువయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. నారాయణ వేధింపులు తట్టుకోలేక తాను పోలీసులను ఆశ్రయించినట్టు తెలిపారు. గత ఎన్నికల సమయంలో తనను ప్రచారం చెయ్యాలని నారాయణ ఇబ్బంది పెట్టారని ప్రియ ఆవేదన వ్యక్తం చేశారు. తన కుటుంబాన్ని కూడా నారాయణ అనేక ఇబ్బందులు పెట్టారని ఆరోపించారు.
వీడియో వైరల్…
ఇన్ స్టాగ్రామ్ లో ప్రియ విడుదల చేసిన వీడియో వైరల్ అయింది. ఈ వీడియోలో… తాను 29 ఏళ్లు భరించాను, ఇక భరించే శక్తి నాకు లేదని ఆవేదన చెందారు. సీతాదేవి కూడా 16 సంవత్సరాలు అరణ్యవాసం చేసిందని, కానీ నేను 29 ఏళ్లు నరకం అనుభవించాననన్నారు.
కృష్ణప్రియ భర్త స్పందన
సామాజిక మాధ్యమాల్లో తన భార్య కృష్ణ ప్రియ విడుదల చేసిన వీడియోలపై మాజీ మంత్రి నారాయణ సోదరుడు సుబ్రహ్మణ్యం స్పందించారు. తన భార్య కృష్ణప్రియ కొద్ది రోజులుగా మానసిక అనారోగ్యంతో బాధపడుతోందని తెలిపారు. ఆమె వారం రోజులుగా కొన్ని వీడియోలు వీసి సోషల్ మీడియాలో పెట్టారన్నారు. ఈ వీడియోలు తమ కుటుంబం పరువునకు భంగం కలిగించేలా ఉన్నాయన్నారు. 2017లో కృష్ణప్రియను సైక్రియాటిస్టుకు చూపించామన్నారు. అయినా వ్యాధి నయం కాకపోవడంతో 2019లో గుంటూరులో మరో సైక్రియాటిస్టుకు చూపించామని, అయినా రికవరీ కాలేదని తెలిపారు. తెలంగాణలోని మానస హాస్పిటల్, గచ్చిబౌలిలోని ఎఐజి ఆసుపత్రిలో కూడా ఆమెకు చికిత్స అందించామన్నారు. ఈ ఏడాది మేలో ప్రియకు క్యాన్సర్ అని వైద్యులు నిర్థారించారన్నారు. యశోద ఆస్పత్రిలో ప్రియకు సర్జరీ చేశారని సుబ్రహ్మణ్యం తెలిపారు. ఇంకా కీమో థెరపీలు చేయిస్తున్నామన్నారు. ఇంకా తన భార్యకు చికిత్స ఇప్పిస్తూ జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. క్యాన్సర్ చికిత్స కారణంగా సైక్రియాటిస్టు మందులు నిలిపివేశామన్నారు. ఆమె పెడుతున్న వీడియోలు మానవతాకోణంలో పట్టించుకోవద్దని కోరారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News