Thursday, January 9, 2025

గోషామహల్ బిజెపి అభ్యర్థిగా నేనే పోటీ చేస్తా: రాజాసింగ్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థిగా గోషామహల్ నుంచి తాను పోటీ చేస్తానని ఎమ్మెల్యే రాజాసింగ్ పేర్కొన్నారు. పార్టీ సీనియర్ నేతలైన బండి సంజయ్, కిషన్‌రెడ్డి ఆశ్వీరాదం తనకుందని,  యుద్దానికి సిద్దం అంటూ ట్వీట్ చేశారు. గోషా మహల్ నియోజకవర్గం ప్రజలంతా ఎన్నికల పోరుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో బిజెపి అధికారం చేపడుతుందని, సిఎం కెసిఆర్ ప్రకటించిన అభ్యర్థుల కంటే బిజెపి అభ్యర్థులు ముందువరుసలో ఉంటారని పేర్కొన్నారు.

2018 ఎన్నికల్లో కూడా ఈ విధంగానే అధికార పార్టీ అభ్యర్థులను ప్రకటించిందని గోషామహల్ బిఆర్‌ఎస్ అభ్యర్ది ఎంపిక మజ్లిస్ నాయకుల నిర్ణయం మేరకు ఉంటుందన్నారు. గత ఎన్నికల్లో తనను ఓడించడానికి చాలా వరకు డబ్బులు ఖర్చు చేశారని ఆరోపించారు. కానీ తను గెలిచానని, తరువాత కూడా బిజెపి అభ్యర్థిగా తానే ఉంటానని చెప్పారు. బిజెపి పెద్దల ఆశీర్వాదం ఉందని, గోషామహాల్ ప్రజలు సిద్ధంగా ఉండాలని, యుద్ధం మొదలైందన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News