Thursday, January 23, 2025

నాటక రంగానికి నా వంతు సహకారం అందిస్తా

- Advertisement -
- Advertisement -

ఖమ్మం : కంప్యూటర్ యుగంలో కూడా నాటకాన్ని తిలకించటానికి పెద్ద ఎత్తున ప్రేక్షకులు హాజరు కావడం గొప్పవిషయమని, 2015 నుంచి ప్రతి నెలా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి తన వంతు సహకారం అందిస్తానని ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ అన్నారు. ఖమ్మంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో జరిగిన ‘నెల నెలా.. వెన్నెల’ 71వ నెల కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు.

ఆత్మీయ అతిధిగా పాల్గొన్న కార్పొరేటర్ కర్నాటి కృష్ణ మాట్లాడుతూ చిన్నతనంలో అనేక నాటకాలు ప్రదర్శించామని, ఈ కార్యక్రమంలో పాల్గొనటం ఆనందంగా ఉందన్నారు. సంస్థ నిర్వాహకులు మోటమర్రి జగన్మోహనరావు, ఎ.సుబ్రహ్మణ్యకుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వాసిరెడ్డి వీరభద్రం, బత్తిన నాగప్రసాద్, బత్తిన నీరజ, దేవేంద్ర, యాంకర్ రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాయల్ డాన్స్ అకాడమీ సంతోష్‌రెడ్డి బృందం కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శించారు. తరువాత మద్దుకూరి ఆర్ట్ క్రియేషన్స్ చిలకలూరిపేట వారి మృత్యపత్రం నాటిక ప్రేక్షకులను అలరించింది. సమాజంలో లంచగొండి తనం ఏ విధంగా పాతుకపోయిందో ఈ నాటిక కళ్లకు కట్టినట్లు చూపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News