Monday, December 23, 2024

మళ్లీ దర్శకత్వం చేస్తా: విశ్వక్ సేన్

- Advertisement -
- Advertisement -

డైనమిక్ హీరో విశ్వక్ సేన్ హీరోగా నటించి దర్శకత్వం వహించి నిర్మించిన రొమాంటిక్ కామెడీ యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘దాస్ కా ధమ్కీ’. ఈ చిత్రం ఉగాది కానుకగా విడుదలైంది. హైదరాబాద్‌లో ఏర్పాటైన విలేకరుల సమావేశంలో విశ్వక్‌సేన్ మాట్లాడుతూ “దాస్ కా ధమ్కీ మూవీ మేము అనుకున్నదాని కంటే పెద్ద సక్సెస్ అయింది. నా కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ వచ్చాయి. నిజానికి కామెడీ నా బలం కాదు. యాక్షన్, డార్క్ డ్రామా, ఇంటెన్స్ ఎమోషన్స్ బాగా డైరెక్ట్ చేస్తా.

అయితే ఈ సినిమాతో కామెడీ కూడా బాగా తీయగలననే నమ్మకాన్ని ఇచ్చారు ప్రేక్షకులు. ఫస్ట్ హాఫ్‌ని హిలేరియస్‌గా ఎంజాయ్ చేస్తున్నారు. సినిమాలో డ్యుయల్ రోల్‌కి మంచి స్పందన రావడం చాలా ఆనందంగా వుంది. ఇక ప్రస్తుతం నాలుగు సినిమాలు ఒప్పుకున్నాను. అవి పూర్తి చేయాలి. ఆ నాలుగు సినిమాల తర్వాత దర్శకత్వం చేస్తా. ఫలక్ నామా దాస్ 2, ధమ్కీ 2 రెండూ వున్నాయి” అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News