Monday, December 23, 2024

పార్టీ బలోపేతానికి నా వంతు కృషి చేస్తా : బండి సంజయ్

- Advertisement -
- Advertisement -

హస్తినలో పార్టీ చీఫ్ నడ్డాను కలిసిన బండి సంజయ్

హైదరాబాద్ : రాష్ట్రంలో అధికారం చేపట్టేందుకు పార్టీ హస్తిన పెద్దలు ఏ బాధ్యతలు అప్పగించినా స్వీకరించి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌కుమార్ పేర్కొన్నారు. సోమవారం ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను మర్యాదపూర్వకంగా కలిసిన శాలువాతో సన్మానించి ఆరగంటల పాటు నడ్డాతో పార్టీలో జరుగుతున్న పలు విషయాలపై చర్చించారు. ఈ భేటీలో పార్టీ నూతన జాతీయ ప్రధానకార్యదర్శి రాధామోహన్ అగర్వాల్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ కేంద్రంలో మూడోసారి బిజెపిని అధికారంలోకి తీసుకురావడమే తన లక్ష్యమన్నారు. అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి పని చేస్తానని స్పష్టం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News