Wednesday, January 22, 2025

నేనున్నా ఇంతగా చేస్తానో లేదో !

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/సిద్దిపేట ప్రతినిధి : తెలంగాణ భారతదేశానికి తలమానికమైతే సిద్దిపేట నియోజకవర్గం యావత్ తెలంగాణకే తలమానికంగా హరీశ్‌రావు నాయకత్వంలో ముందుకుపోతోందని సిఎం కెసిఆర్ అన్నారు. సిద్ధిపేట విజయ శంఖారావం సభలో సిఎం కెసిఆర్ తన ప్రసంగంలో.. ‘సిద్దిపేటను జిల్లా చేసుకున్న తర్వాత చాలా బాధలు పోయినయ్. ఇవాళ రైలొచ్చేసిం ది. అన్నీ రకాల సదుపాయాలు ఉన్నాయి. గొ ప్ప వర్తక, వాణిజ్య కేంద్రంగా , ఐటి కేంద్రంగా, కాలుష్యం లేని పరిశ్రమల కేంద్రంగా, గొప్ప ధాన్యం పండించే వ్యవసాయ క్షేత్రంగా సిద్దిపేట ఎదగడం చా లా ఆనందంగా ఉంది. మీరు ఇదే రకంగా హరీశ్‌ను మరొకసా రి అద్భుతంగా దీవించి మీ మెజారిటీని మీరే తిరగరాయాలి.

బ్రహ్మాండంగా విజయం సాధించేటట్టు కారు గుర్తుకే ఓటు వేయాలి. సిద్దిపేటకు ఒక్కటే ఒక్కటి తక్కువుంది. అది గాలిమోటారు రావాలి. మంచి నీళ్లు వ చ్చినయ్. నీళ్లు వచ్చినయ్. అధికారం వచ్చింది. గౌరవం వచ్చింది. మెడికల్ కాలేజీ వచ్చింది. మినీ యూనివర్సిటీ కూడా వస్తుంది. ఇంకా చాలా ఇన్‌స్టిట్యూషన్లు వస్తున్నాయి. ఇంజనీరింగ్ కాలేజీలు వస్తున్నాయి. సిద్దిపేటకు హైదరాబాద్ చాలా సమీప ప్రాంతం. ఇవతలి పక్కన ఉన్న కంటోన్మెంట్ దాటితే 75 కిలోమీటర్లు ఉంటది. సిద్దిపేటకు మంత్రి హరీశ్‌రావు పట్టుబట్టి ఐటి హబ్ కూడా తెచ్చిండు. రాబోయే రోజుల్లో ఒక అ ద్భుతమైన వజ్రపు తునకలా తెలంగాణలో సిద్దిపేట తయారవుతుందని మీ అందరికీ హామీ ఇస్తున్నా. హరీశ్‌రావు మీద ఎంఎల్‌ఎలు, మంత్రుల్లో ఒక జోక్ ఉంది. అదేంటంటే. హరీశ్ అక్కడ తిరుగుతడు. ఇక్కడ తిరుగుతడు. తట్టెడు పెండ కనబడితే సిద్దిపేటలో వేసుకుంటడు అని చెబుతరు. అంటే ఆయన టైమ్‌లో మంత్రి అయిన నాటి నుంచి నేటి దాకా ప్రతి ఒక్క విషయంలో ప్రతి కార్యక్రమాన్ని ఈ ప్రాంతానికి తేవడంలో అద్భుతమైన కృషి చేస్తారు.

నిజంగా హరీశ్‌రావు జాగాలో నేను ఎంఎల్‌ఎగా ఉన్నా అంత చేయగలనో లేదో తెలియదు. అంత బ్రహ్మాండంగా.. అద్భుతంగా పనిచేస్తుండు. మీ అందరికి మనవి చేసేది ఒక్కటే. సిద్దిపేటకు ఏం జరిగిందో చెబితే బాగోదు. నేను హరీశ్‌రావును పొగిడినట్టు అయిత ది. మీకు ఒక్కటే మాట చెబుతున్నా. ఒక్కటే మాటకు నూరు అర్థాలు తీసుకోవాలే. కరీంనగర్‌లో ఎంపీగా గెలిచిన. తెలంగాణ కోసం ఢిల్లీలో పనిచేయాలి. రాష్ట్రాన్ని విడిచిపెట్టి పోవాలి. నా కన్న ఊరు. పెంచిన మీ అందర్నీ విడిచిపోవాలి. అక్కడ కరీంనగర్ రోడ్డులో ఒక హాలులో మీటిం గ్ పెట్టుకున్నం. ఒకపక్క నేను ఏడ్వ. మరోదిక్కు హాలు మొత్తం ఏడ్వ. అందరం ఓ 10 నిమిషాలు ఏడ్చినం. ఆ తర్వాత ఉప ఎన్నికల్లో నేను తీసుకొచ్చి ఆరడుగుల బుల్లెట్ హరీశ్‌ను మీకు అప్పగిస్తే నేను ఊహించిన దానికంటే ఎన్నో రెట్లు బ్రహ్మాండంగా హరీశ్ పనిచేసి నా మాట నిలబెట్టాడు. మీ గౌరవం కాపాడాడు’ అని సిఎం కెసిఆర్ అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News