సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల దశలో ప్రముఖ సినీనటి కంగనా రనౌత్ తాను రాజకీయాలలోకి రావచ్చునని పరోక్షంగా తెలిపారు. హిమాచల్ ప్రదేశ్ ప్రజలకు తాను ఏదో ఒక హోదాలో సేవచేయదల్చుకున్నానని. ఇందుకోసంఅవసరం అయితే రాజకీయాలలోకి కూడా రావచ్చునని స్పష్టం చేశారు. బిజెపి ప్రభుత్వం కోరుకుంటే ఏ స్థాయిలో అయినా తన ప్రాతినిధ్యం ఉంటుందని శనివారం ఆమె ఇక్కడ ఓ కార్యక్రమం నేపథ్యంలో తెలిపారు. కంగనా హిమచల్‌ప్రదేశ్‌లోని మనాలీకి చెందిన వారు. తన సొంత రాష్ట్ర ప్రజల బాగుకు ఏదో ఒక రూపంలో పాటుపడే అవకాశం వస్తే దీనిని తాను కాదనబోనని స్పష్టం చేశారు. పరిస్థితి ఏ విధంగా ఉన్నా ప్రభుత్వం కోరితే తాను ముందుకు వస్తానని, వారి పిలుపు తన అదృష్టంగా భావిస్తానని బిజెపి పట్ల కంగనా తన విధేయతను చాటారు.
నవంబర్ 12వ తేదీన హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఈ దశలో జరిగిన పంచాయత్ ఆజ్‌తక్ హిమాచల్‌ప్రదేశ్ కార్యక్రమంలో కంగనా పాల్గొన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికలలో మండి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఉందని, ఈలోగా అవసరం అయితే రాజకీయాలతో ప్రజాసేవకు దిగుతానని తెలిపారు ట్విట్టర్‌ను మస్క్ తీసుకోవడంపై స్పందిస్తూ కంగనా తన ట్విట్టర్ ఖాతాపై నిషేధం తొలిగిపోతుందని భావిస్తున్నానని, ఇదే జరిగి తాను ట్విట్టర్‌లో స్పందిస్తూ ఉంటే జనం బతుకులు మెరుగుపడుతాయి. అంతా సంచలనాత్మకం అవుతుంది. అయితే తన పలు కేసులలో చిక్కుకుని తాను ఇక్కట్లకు గురి అవుతానని ఇప్పుడు ట్విట్టర్ ఖాతా లేకపోవడం హాయిగా ఉందని చెప్పిన కంగనా తిరిగి ఎంటరైతే అందరికి కావల్సినంత మసాలా దక్కుతుందని వ్యాఖ్యానించారు.
I will enter Politics if Govt Wants: Kangana