Saturday, November 16, 2024

కెసిఆర్‌ పాలనలో స్వర్ణయుగంగా తెలంగాణకు పునాది పడింది: ఆర్ఎస్పి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: ప్రత్యేక పరిస్థితుల్లో బీఆర్ఎస్ లో చేరుతున్నట్లు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ చెప్పారు. తెలంగాణ వాదం, బహుజన వాదం రెండూ ఒక్కటేనని.. ఆ రెండు అణిచివేతకు గురయ్యాయని అన్నారు. సోమవారం బిఆర్ఎస్ లో చేరేందుకు ప్రవీణ్‌ కుమార్‌ తన అనుచరులతో కలిసి తెలంగాణ భవన్ కు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బిఆర్ఎస్ అధికారంలో లేకున్నా కెసిఆర్‌ ప్రజల గుండెల్లో ఉన్నారని చెప్పారు. కెసిఆర్‌ పాలనలో స్వర్ణయుగంగా తెలంగాణకు పునాది పడిందని.. కేసీఆర్‌ కల్పించిన వేదిక ద్వారా లక్ష్య సాధన కోసం పోరాడుతానన్నారు.

రేవంత్ రెడ్డి.. తనకు టీఎస్పీఎస్సీ చైర్మన్ పదవి ఇస్తానన్నారు.. కానీ తాను దానని తిరస్కరించానని ఆయన తెలిపారు. రేవంత్ రెడ్డి గేట్లు తెరిస్తే.. అసమర్థులు, స్వార్థపరులు గొర్రెల మందలా వెళ్తున్నారని.. కానీ, ఆర్ఎస్ పి.. ఆ గొర్రెల మందలో ఒకడు కాదని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News