Monday, January 20, 2025

వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను: జగ్గారెడ్డి కీలక నిర్ణయం

- Advertisement -
- Advertisement -

I will not Contest in 2023 Assembly Elections: Jagga Reddy

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎంఎల్‌ఎ జగ్గారెడ్డి ప్రకటించారు. అయితే గతంలో లాగా ఆయన ఎవరినీ టార్గెట్ చేయలేదు. తన స్థానంలో సంగారెడ్డి కార్యకర్తలకే అవకాశం ఇస్తానన్నారు. కేడర్ వద్దంటే తన భార్య నిర్మలను బరిలోకి దింపుతానని ప్రకటించారు. అయితే 2028 ఎన్నికల్లో మాత్రం తాను తిరిగి పోటీ చేస్తానని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయబోనంటూ జగ్గారెడ్డి చేసిన ప్రకటన సంచలనంగా మారింది. కాంగ్రెస్ కార్యకర్తలను షాకింగ్ కు గురి చేసింది. అయితే తన భార్య నిర్మలను సంగారెడ్డి నుంచి పోటీ చేయించేందుకే జగ్గారెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారనే టాక్ వినవస్తోంది. కొన్ని రోజులుగా మీడియాకు దూరంగా ఉంటున్నారు. తన నియోజకవర్గంలో తిరుగుతున్నారు.

గతంలో పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ సయమంలో ఆయన కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెబుతారనే ప్రచారం సాగింది. తర్వాత హైకమాండ్ దూతలు మాట్లాడటంతో శాంతించారు. అయితే తాను దసరా వరకు మీడియా ముందుకు రానని ప్రకటించారు. అప్పటి నుంచి సంగారెడ్డికే పరిమితమయ్యారు. రాష్ట్ర రాజకీయాల్లో మునుగోడు ఉప ఎన్నిక కాక రేపుతున్నా ఆయన పట్టించుకోవడం లేదు. మునుగోడుపై పార్టీ పెద్దలు నిర్వహించిన సమావేశాలు కూడా దూరం గానే ఉన్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సన్నాహాక సమావేశాలకు కూడా జగ్గారెడ్డి హాజరు కాలేదు. కాగా, చాలా రోజులుగా రాజ కీయాల్లో యాక్టివ్ గా ఉంటున్నారు నిర్మలా జగ్గారెడ్డి. ఆమె మెదక్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పని చేశారు. 2018 ఎన్నికల్లో తన భర్త తరపున నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేశారు. తన కూతురుతో కలిసి అంతా తానే చూసుకున్నారు. జగ్గారెడ్డి అరెస్టైన సమయంలోనూ పార్టీ నేతలకు అండగా నిలిచారు. ఉమ్మడి మెదక్ జిల్లా స్థానిక సంస్థల ఎంఎల్‌సి ఎన్నికల్లోనూ నిర్మల పోటీ చేశారు.
విఆర్‌ఎల సమస్యల పరిష్కారానికై ట్యాంక్ బండ్ పై నిరసన ర్యాలీ
ప్రజా సమస్యలపై చర్చిద్దామంటే అసెంబ్లీ సమావేశాలు పూర్తి స్థాయిలో జరగడం లేదని సంగారెడ్డి ఎంఎల్‌ఎ జగ్గారెడ్డి అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అర్ధరాత్రి వరకు అసెంబ్లీ సమావేశాలు జరిగేవని గుర్తు చేశారు. ప్రతిపక్షాలకు అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదు, ప్రజా సమస్యలపై చర్చ జరగడం లేదన్నారు. ఆరు నెలల తర్వాత జరిగే సమావేశాలు మూడు రోజులకే పరిమితమా..? అని ప్రశ్నించారు. విఆర్‌ఎలు రాష్ట్రం వచ్చాక ఆగమయ్యారు. అసెంబ్లీలో మాట్లాడే వీలుండదు కాబట్టి తాను నిరసన తెలపనున్నట్లు ఈనెల 12న ట్యాంక్ బండ్ అంబేడ్కర్ విగ్రహం నుంచి అసెంబ్లీ వరకు నిరసన ర్యాలీ చేస్తానని స్పష్టం చేశారు.

I will not Contest in 2023 Assembly Elections: Jagga Reddy

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News