Friday, January 10, 2025

కేసీఆర్ గీసిన గీత దాటను.. కేసీఆర్‌కు విధేయుడిగానే ఉంటా

- Advertisement -
- Advertisement -
  • బిఆర్‌ఎస్ పార్టీ శ్రేణులను కంటికి రెప్పలా కాపాడుకుంటా
  • ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య

స్టేషన్ ఘన్‌పూర్: సీఎం కేసీఆర్ గీత దాటను అని.. కేసీఆర్‌కు విధేయుడిగా ఉంటానని ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య అన్నారు. మంగళవారం స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాయలయంలో తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్యను కలవడానికి వచ్చిన ఎంపీపీలు, జడ్పీటీసీలు, మండల పార్టీ అధ్యక్షులు, సర్పంచులు, ఎంపీటీసీలు గ్రామాధ్యక్షులు, అభిమానులతో క్యాంపు కార్యాలయం కిక్కిరిసిపోయింది.

ఎమ్మెల్యే రాజయ్యను కలువడానికి విచ్చేసిన రాజన్న అభిమానులు, బీఆర్‌ఎస్ శ్రేణులను చూసి ఎమ్మెల్యే రాజయ్య ఒకింత భావోద్వేగానికి లోనై కార్యకర్తలకు సాష్టాంగ నమస్కారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాజన్న అభిమానులు, బీఆర్‌ఎస్ శ్రేణులు ఎవరూ అధైర్యపడొద్దని మిమ్మల్ని అందరిని కంటికి రెప్పలా కాపాడుకుంటానని ధైర్యం చెప్పారు. కేసీఆర్ ఆశీస్సులు మనపై నిండుగా మెండుగా ఉంటాయన్నారు.

సీఎం కేసీఆర్ గీత దాటనని, పార్టీకి, అధినాయకుడికి విధేయుడిగా ఉంటానన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి రూ. 3 కోట్ల ఎమ్మెల్యే సీడీఎఫ్ నిధులు మంజూరు కావడం జరిగింది. అదే విధంగా రూ. 12.60 లక్షల నిధులు రావడం జరిగింది. మైనార్టీ బంధు, బీసీ బంధు, దళిత బంధు, గృహలక్ష్మి, 100 పడకల ఆసుపత్రి కార్యరూపం తదితర కార్యక్రమాలను ప్రజల చెంతకు తీసుకపోడానికి బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు సిద్ధం కావాలన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు యదావిధిగా కొనసాగుతాయన్నారు. నిత్యం ప్రజల్లో ఉండటమే నాకు తెలుసు.. నా చివరి రక్తపు బొట్టు ఉన్నంత వరకు మీ కోసమే పనిచేస్తా అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News