Monday, December 23, 2024

నేను దర్శకత్వం వహించను

- Advertisement -
- Advertisement -

I will not direct

లక్కీ మీడియా అధినేత బెక్కెం వేణుగోపాల్ నిర్మాణంలో రూపొందిన మూడు సినిమాలు ఈ ఏడాది విడుదల కాబోతున్నాయి. పాగల్ చిత్రం తర్వాత శ్రీవిష్ణు హీరోగా ‘అల్లూరి’, సోహైల్ హీరోగా ‘బూట్‌కట్ బాలరాజు’ చిత్రాలు రాబోతున్నాయి. బుధవారం బెక్కెం వేణుగోపాల్ పుట్టినరోజు సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ చెప్పిన విశేషాలు…

నిర్మాతగా 16 ఏళ్లు…

నా మొదటి సినిమా 2006లో విడుదలై.. నేను నిర్మాతగా అడుగుపెట్టి 16 ఏళ్లు పూర్తయ్యాయి. ‘టాటా బిర్లా మధ్యలో లైలా’ నా తొలి చిత్రం. అప్పటి నుండి నేను చాలా సృజనాత్మకమైన వ్యక్తులతో జర్నీ చేశాను.

ఈ ఏడాది మూడు సినిమాలు…
గత ఏడాది ‘పాగల్’ నాకు మంచి ఫలితాలను ఇచ్చింది. ప్రస్తుతం ‘బూట్‌కట్ బాలరాజు’ , ‘అల్లూరి’ సినిమాలు రన్నింగ్‌లో ఉన్నాయి. ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న మరికొన్ని ప్రాజెక్ట్‌లను కూడా ఓకే చేశాను. ఈ సంవత్సరం నా బ్యానర్ నుండి కనీసం 3 సినిమాలు ఆశించవచ్చు.

ఎమోషన్ యాక్షన్ డ్రామా…
‘అల్లూరి’ చిత్రాన్ని జులైలో విడుదల చేయాలని అనుకుంటున్నాం. ఇది సీరియస్ ఎమోషన్ యాక్షన్ డ్రామా. ఇక- ఆది సాయికుమార్‌తో ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లర్ ప్లాన్ చేస్తున్నాను. జూన్‌లో సెట్స్‌పైకి వెళ్లనుంది ఈ చిత్రం.

ఇది స్వాగతించే ధోరణి…

ఓటిటి అనేది సినిమాలో ఒక భాగం. ఇది స్వాగతించే ధోరణి. ఓటిటి నిర్మాతలకు కొత్త ఆదాయ వనరులను జోడించింది. చాలా మంది ప్రేక్షకులు ఓటిటిలో మాత్రమే సినిమాలను చూస్తున్నారు. ఆ విధంగా సినిమా రీచ్ పెరుగుతుంది. మంచి కథ దొరికితే తప్పకుండా ఓటిటిలో అడుగుపెడతాను.

నేను దర్శకత్వం వహించను…

మీడియాను బ్యాక్‌డ్రాప్‌గా తీసుకొని సినిమా చేయాలనుకుంటున్నాను. ఇది నాల్గవ ఎస్టేట్ ప్రత్యేకతను తెలియజేసేలా వుంటుంది. ఇందులో మీడియా గొప్పతనం, ప్రజాస్వామ్యంలో దాని పాత్ర, జర్నలిస్టులు ఏం చేయగలరు… తదితర అంశాల గురించి అద్భుతంగా చూపించనున్నాం. నేను దీనికి దర్శకత్వం వహించను.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News