- Advertisement -
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఒకరిపై మరొకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. అయితే తాజాగా కిషన్ రెడ్డి.. రేవంత్ రెడ్డి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డివి గాలి మాటలు అని.. వాటికి సమాధానం ఇవ్వాల్సిన అవసరం తనకు లేదని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఇష్టమొచ్చినట్లు మాట్లాడిన రేవంత్‌కు ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెప్పారని అన్నారు.
ముందుక ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ నెరవేర్చాలి అని కిషన్ రెడ్డి మండిపడ్డారు. రైతులకు ఎకరాకు రూ.15 వేలు, నిరుద్యోగ భృతి, ఆడబిడ్డలకు నెలకు రూ.2,500, దళితుకు రూ.12 లక్షలు, ఆడపిల్లలకు స్కూటిలు ఇస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ఆయన గుర్తు చేశారు. వాటిని వెంటనే నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు.
- Advertisement -