Sunday, December 22, 2024

పాలమూరు బిడ్డగా మీకు సేవచేస్తా

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ విజయభేరి సభల్లో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

మన తెలంగాణ/ నాగర్‌కర్నూల్ ప్రతినిధి: తెలంగాణలో భారీ సాగునీటి ప్రాజెక్టులు, అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ పుణ్యమేనని తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఎనుముల రేవంత్ రెడ్డి అన్నారు. మంగళవారం నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి, అచ్చంపేటలలో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి ఎన్నికల బహిరంగ సభలలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో సా గునీటి ప్రాజెక్టులను నిర్మించిందే కాంగ్రెస్ అన్నా రు. హైదరాబాద్‌కు కృష్ణానది ద్వారా అందించింది కాంగ్రెస్ అని, హైదరాబాద్‌ను అన్ని రంగాలలో అభివృద్ధి చేయడమే కాకుండా రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, అంతర్జాతీయ విమానాశ్రయం, ఫ్లై ఓవర్లు వంటివి నిర్మించింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు.

దేశానికి కంప్యూటర్‌ను పరిచయం చేసిందే రాజీవ్ గాంధీ అన్నారు. 75 ఏళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీ మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన బూర్గుల రామకృష్ణారావుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసి పాలమూరు జిల్లాకు ప్రాధాన్యతను ఇచ్చిందన్నారు. నన్ను సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు పిసిసి అధ్యక్షుడిని చేశారని, మీ జిల్లా బిడ్డను ఈ మట్టిలో పుట్టి ఈ మట్టిలో కలిసేవాడిని మీ బాగోగులు చూసుకుంటానని, మీరు నన్ను ఆదరిస్తే ముఖ్యమంత్రిని అవుతానని పరోక్షంగా రేవంత్ రెడ్డి అన్నారు. మీకు ఏమి కావాలన్నా ఎవరినీ అడుక్కోవాల్సిన అవసరం ఉండబోదని, ఈ జిల్లా బిడ్డగా మీరు మీ బిడ్డగా ఆదరించి గెలిపిస్తే మీ ప్రాంతాలను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి చేసి చూపించే బాధ్యత నాది అన్నారు. నవంబర్ 30న 4 కోట్ల తెలంగాణ బిడ్డలు ఏకమై కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే డిసెంబర్ 9న ఇందిరమ్మ రాజ్యం వస్తుందని రేవంత్ రెడ్డి అన్నారు.

ఇందిరమ్మ రాజ్యం వస్తే రైతుల రుణమాఫీతో పాటు సంక్షేమ అభివృద్ధి పథకాలతో ఆరు గ్యారంటీ స్కీంలతో ప్రజల రుణం తీర్చుకుంటామన్నారు. ఆరు గ్యారెంటీలతో ఇందిరమ్మ రాజ్యం రావ డం ఖాయమని ఆయన అన్నారు. నాగర్‌కర్నూల్ బహిరంగ సభ లో పిసిసి ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపి మల్లు రవి, మాజీ ఎంపి మంద జగన్నాథ్, ప్రొఫెసర్ కోదండ రాం, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు హబీబ్, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కొడిదెల రాము, సిపిఐ నాయకులు బాల్ నర్సింహాలతో పాటు కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అచ్చంపేట బహిరంగ సభలో పిసిసి ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపి మల్లు రవి, జెడ్పి వైస్ చైర్మెన్ బాలాజి సింగ్‌లతో పాటు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News