Thursday, December 19, 2024

పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కష్టపడి పనిచేస్తా

- Advertisement -
- Advertisement -
మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

హైదరాబాద్: పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కష్టపడి పనిచేస్తానని, తనకు ప్రచార కమిటీ కో చైర్మన్‌గా బాధ్యతలు అప్పగించిన ఏఐసిసి, పిసిసి నేతలకు కృతజ్ఞతలని మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. గాంధీభవన్‌లో ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చిన దేవత సోనియా అని, ఆశించిన స్థాయిలో రాష్ట్రంలో అభివృద్ధి జరగడం లేదన్నారు. ఈ ప్రభుత్వం వల్ల తెలంగాణ ప్రజలకు ఒరిగింది ఏమీలేదన్నారు. అధికారంలో ఉన్నామన్న అహంతో బిఆర్‌ఎస్ నేతలు మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు. సోనియా తెలంగాణ ఇవ్వకుంటే ఈ రోజు వారంతా ఎక్కడ ఉండేవారని ఆయన తెలిపారు. ఆచరణకు సాధ్యమైతేనే కాంగ్రెస్ హామీలు ఇస్తుందని ఆయన పేర్కొన్నారు.
కబ్జా చేసినట్లు తేలితే భూమి మొత్తం రాసిస్తా. తాను 20 గుంటల భూమి కబ్జా చేశానంటే ఎవరైనా నమ్ముతారా అని ఆయన ప్రశ్నించారు. తనపై బురదజల్లే ప్రయత్నం జరుగుతుందన్నారు.

తాను న్యాయస్థానాన్ని ఆశ్రయించానన్నారు. తాను కబ్జా చేసినట్లు తేలితే తన భూమి మొత్తం రాసిస్తానన్నారు. ఎస్‌ఆర్ గార్డెన్ పడగొట్టాలని చూశారన్నారు. ఎస్‌ఆర్ గార్డెన్ కట్టి 13 సంవత్సరాలు అయ్యిందని, అప్పుడే ఎందుకు సర్వే చేయలేదని ఆయన ప్రశ్నించారు. రాజకీయ కక్ష్య సాధింపులకు ప్రభుత్వం దిగుతుందన్నారు. ఆ పార్టీలో ఉన్నప్పుడు ఒక రకంగా, పార్టీ మారాక మరోలా ఉంటుందా అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్‌పై విమర్శల దాడి పెరిగిందంటే కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగిందని అర్థం అయిందన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News