Monday, December 23, 2024

రావి నారాయణ రెడ్డిపై పాట రాస్తా

- Advertisement -
- Advertisement -

జాతీయ అవార్డు గ్రహీత సుద్దాల అశోక్ తేజ

మన తెలంగాణ / హైదరాబాద్ : రావినారాయణ రెడ్డిపై పాట రాస్తానని జాతీయ అవార్డు గ్రహీత సుద్దాల అశోక్ తేజ తెలిపారు. ఈ మేరకు జాతీయ అవార్డు గ్రహీత సుద్దాల అశోక్ తేజను శనివారం రావి నారాయణ రెడ్డి సేవా సంస్థ ప్రతినిధులు కలిసి అభినందించారు. సాహిత్య పరంగా ఆయన చేస్తున్న సేవలు, తెలంగాణ సంస్కృతికి చేస్తున్న కృషిని కొనియాడారు. అదే విధంగా రావి నారాయణ రెడ్డి జీవిత విశిష్టత, విలాస భూ స్వామ్య కుటుంబ జీవితం వదులుకొని చేసిన ప్రజా సేవను ప్రతిబింబించే విధంగా, నేటి తరానికి తెలియ చేసే విధంగా ఒక పాటను రాయాల్సిందిగా కోరారు.

అందుకు సుద్దాల అశోక్ తేజ సానుకూలంగా స్పందించి, వారి తండ్రి సుద్దాల హనుమంతు, రావి నారాయణ రెడ్డి కలిసి ఆనాడు నిర్వహించిన ఉద్యమ కార్యక్రమాలను గుర్తుకు తెచ్చుకొని, రావి నారాయణ రెడ్డి మీద గౌరవంతో తప్పకుండా రాస్తానని చెప్పారు. సుద్దాలను కలిసిన వారిలో సేవా సంస్థ అధ్యక్షుడు చెరుకుపల్లి శ్రీనివాసు, సలహా దారులు భువనగిరి సత్యనారాయణ, సబ్యులు విజయకుమార్, ఉదయకుమార్, రాజలింగం ఉన్నారు.

Suddala 2

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News