Saturday, December 28, 2024

సిరిసిల్లలో నాలుగు సార్లు గెలిచాను

- Advertisement -
- Advertisement -

ఎప్పుడూ ఒక రూపాయి పంచలేదు..
ఒక చుక్క మందు పోయలేదు
ఇది నాకు నేను పెట్టుకున్న నియమం…
అందరూ ఇలా ఉండాలని ఎవరికీ చెప్పలేదు

రాజకీయ నాయకుడు ఓటమికి భయపడకూదు
మన తెలంగాణ/ హైదరాబాద్:  రాజకీయ నాయకుడు ఎప్పుడూ ఓటమికి భయపడకూదని బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. ఎన్నికలు తాను సిరిసిల్లలో నాలుగు సార్లు పోటీ చేసి గెలిచానని, అందులో ఒక ఉప ఎన్నిక కూడా ఉందని పేర్కొన్నారు. ఈ నాలుగు సార్లలో ఒక్కసారి కూడా ఒక రూపాయి పంచలేదు…ఒక చుక్క మందు పోయలేదని చెప్పారు. ఎన్నికలు ఎప్పుడూ జీవన్మరణ సమస్య కాకూడదని, ఎందుకంటే పనిచేసి గెలిచానా?..పంచేసి గెలిచానా? అది కూడా చూసుకోవాలి కదా? అని పేర్కొన్నారు. ఎందుకంటే డబ్బులు పంచి గెలిస్తే నాకు నేను కూడా సమాధానం చెప్పాలి కదా? పేర్కొన్నారు. ఇది నా పాటికి నేను పెట్టుకున్న నియమం తప్ప అందరూ ఇలా ఉండాలని ఎవరికీ చెప్పలేదని అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News