Thursday, January 23, 2025

సందీప్ వంగా మూవీల్లో నటించనన్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్

- Advertisement -
- Advertisement -

‘యానిమల్’ డైరెక్టర్ సందీప్ వంగాకు హీరోయిన్ కంగనా రనౌట్ గట్టి ఝలక్ ఇచ్చింది. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ వంటి బ్లాక్ బస్టర్లు తీసిన సందీప్ వంగా మూవీలో చేరాలని హీరోహీరోయిన్లు అందరూ క్యూ కడుతుంటే, కంగనా మాత్రం దయచేసి తనకు ఎలాంటి పాత్ర ఇవ్వవద్దని చెప్పింది.

ఇటీవల సందీప్ వంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కంగనాతో కలసి పనిచేయాలని ఉందన్నాడు. దీనిపై కంగనా ట్వీట్ చేస్తూ, ‘సమీక్ష, విమర్శ రెండూ ఒకటి కావు. ప్రతి కళనూ సమీక్షించి చర్చించవలసిందే. అది మామూలు విషయం. నా సమీక్ష పట్ల సందీప్ వంగా నవ్వుతూ స్పందించిన వైనం చాలా హుందాగా ఉంది.. అతని ప్రవర్తనలాగే. అందుకు ధన్యవాదాలు సర్. అయితే మీ సినిమాల్లో నాకు  ఎలాంటి పాత్రలూ ఇవ్వకండి. ఒకవేళ ఇస్తే, మీ సినిమాల్లోని ఆల్ఫా మేల్ హీరోలంతా ఫెమినిస్టులు అయిపోతారు. మీ సినిమాలు కూడా ఫ్లాప్ అవుతాయి. కానీ మీరు బ్లాక్ బస్టర్లు ఇవ్వాలి. ఇండస్ట్రీకి మీరు కావాలి’ అంటూ కంగనా ఎక్స్ లో కామెంట్ పోస్ట్ చేసింది. ఇది ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News