Friday, November 22, 2024

ఐఎసి విక్రాంత్ పాటవ పరీక్షలు ప్రారంభం

- Advertisement -
- Advertisement -

IAC Vikrant course exams begin

న్యూఢిల్లీ: దేశీయ పరిజ్ఞానంతో మొట్టమొదటిసారి దేశంలో స్వతంత్రంగా నిర్మించిన విమాన వాహక నౌక(ఐఎసి) విక్రాంత్ సముద్ర పాటవ పరీక్ష బుధవారం ప్రారంభమైంది. ఇదో చారిత్రాత్మక సంఘటనగా భారతీయ నౌకాదళం అభివర్ణించింది. ఎన్నో విశిష్టతలు, శక్తివంతమైన ఈ అతి భారీ విమాన వాహక నౌకకు సముద్రంలో పాటవ పరీక్షలు ప్రారంభం కావడంతో ఇలాంటి వాహకనౌకలు గల దేశాల సరసన భారత్ కూడా చేరినట్లయిందని భారత నౌకాదళం తెలిపింది. 40,000 టన్నుల బరువైన ఐఎసి విక్రాంత్ నిర్మాణానికి దాదాపు రూ. 23,000 కోట్లు ఖర్చయింది. ఈ వాహక నౌక నుంచి విమానయాన ప్రయోగ పరీక్షలను నిర్వహించిన తర్వాత వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో ఐఎసి విక్రాంత్‌ను భారతీయ నౌకాదళంలో ప్రవేశపెట్టడ ం జరుగుతుందని నౌకాదళం తెలిపింది.

IAC Vikrant course exams begin

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News