- Advertisement -
చండీగఢ్ : భారత వైమానిక దళం (ఐఎఎఫ్)కు చెందిన చినూక్ హెలికాప్టర్‌లో‘సాంకేతిక సమస్య’ తలెత్తడంతో ముందు జాగ్రత్త చర్యగా దానిని పంజాబ్ సంగ్రూర్ జిల్లాలో ఆదివారం దింపారని పోలీసులు వెల్లడించారు. సంగ్రూర్ జిల్లా లోంగోవాల్‌లో ధాద్రియన్ గ్రామంలో ఒక బహిరంగ మైదానంలో మధ్యాహ్నం సుమారు ఒంటి గంటకు హెలికాప్టర్ దిగిందని పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. సిబ్బంది, హెలికాప్టర్ సురక్షితం అని ఆయన తెలిపారు.
- Advertisement -