Wednesday, January 22, 2025

పొలాల్లో వాయుసేన హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్

- Advertisement -
- Advertisement -

భోపాల్ : భారత వాయుసేనకు చెందిన ఓ హెలికాప్టర్ సాంకేతిక సమస్య తలెత్తడంతో డుంగరియా గ్రామ సమీపం లోని చెరకు తోటలో ఎమర్జెన్సీ ల్యాండ్ అయింది. రోజువారీ శిక్షణలో భాగంగా భోపాల్ నుంచి చకేరీకి హెలికాప్టర్ బయల్దేరింది. ఆ సమయంలో హెలికాప్టర్‌లో ఆరుగురు ఉన్నారు. అయితే ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. వీరంతా సురక్షితంగా ఉన్నారని వాయుసేన ప్రకటించింది. వాయుసేన బృందం అక్కడకు చేరుకుని సాంకేతిక లోపాన్ని సరిదిద్దే పనిలో నిమగ్నమైంది. నాగపూర్ నుంచి మరో నిపుణుల బృందం రానున్నట్టు పోలీస్‌లు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News