- Advertisement -
జైపూర్ : రాజస్థాన్ లోని అల్వార్‌లో సారిస్కా పులుల సంరక్షణ కేంద్రంలో ఆదివారం సాయంత్రం నుంచి సాగుతున్న ఘోర అగ్ని ప్రమాదాన్ని ఎట్టకేలకు సోమవారం నివారించ గలిగారు. పది చదరపు కిలోమీటర్ల పరిధిలో వ్యాపించిన మంటలను రెండు హెలికాప్టర్ల సాయంతో దాదాపు 200 మంది సిబ్బంది సోమవారం నాటికి అదుపు చేయగలిగారని అధికారులు మంగళవారం తెలిపారు. సమీప గ్రామాల ప్రజలు అడవి లోకి ప్రవేశించరాదని అటవీశాఖ సిబ్బంది హెచ్చరించారు. ప్రమాద ప్రాంతంలో ఏ పులులూ చిక్కుకోలేదని, వాటి సంచారం ఎప్పటికప్పుడు గమనిస్తున్నామని చెప్పారు. ఈ పులుల సంరక్షణ కేంద్రంలో దాదాపు 27 పులులు ఉన్నాయి.
- Advertisement -