Sunday, December 22, 2024

ఐఎఎఫ్ హెలికాప్టర్ ప్రమాదంపై వచ్చే వారం నివేదిక: అధికారిక వర్గాలు

- Advertisement -
- Advertisement -

IAF helicopter crash report next week: Official sources

న్యూఢిల్లీ: సిడిఎస్ జనరల్ బిపిన్‌రావత్‌తోపాటు మరో 13మంది మరణానికి దారితీసిన హెలికాప్టర్ ప్రమాదంపై దర్యాప్తు తుదిదశకు చేరిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. వచ్చేవారం ఎయిర్‌చీఫ్ మార్షల్ విఆర్ చౌదరికి నివేదిక సమర్పించనున్నారు. ఎయిర్ మార్షల్ మానవేంద్రసింగ్ నేతృత్వంలో త్రివిధ దళాల నిపుణులతో దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. డిసెంబర్ 8న తమిళనాడులోని కూనూర్ సమీపంలో ఐఎఎఫ్‌నకు చెందిన ఎంఐ17వి 5 కూలిన విషయం తెలిసిందే. ఆరోజు ఆ ప్రాంతంలో వాతావరణం అనుకూలంగా లేకపోవడం, దానిని గుర్తించి తగిన నిర్ణయం తీసుకోకవడంలో పైలట్ల వైఫల్యమేమైనా ఉన్నదా అన్న కోణంలోనూ దర్యాప్తు జరుగుతోంది. అలాంటిది నిర్ధారిస్తే, దానిని మానవ తప్పిదంగా భావిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News