Monday, January 20, 2025

గన్‌తో కాల్చుకొని జవాన్ ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

భోపాల్: వాయుసేనలో పని చేసే జవాన్ గన్‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మధ్య ప్రదేశ్ రాష్ట్ర గ్వాలియర్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… పంజాబ్ రాష్ట్రం కపుర్తాలా ప్రాంతానికి చెందిన జస్ముందా అనే యువకుడు మహారాజ్‌పూర్ ఎయిర్ బేస్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. వాట్ టవర్‌లో విధులు నిర్వహిస్తుండగా గన్‌తో ఛాతీపై కాల్చుకొని కుప్పకూలిపోయాడు. సహోద్యోగి అక్కడి వచ్చేసరికి రక్తపు మడుగులో కనిపించడంతో పైఅధికారులకు సమాచారం ఇచ్చాడు. ఉన్నతాధికారులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

మృతదేహాన్ని పక్కన గన్ తో పాటు కొంచెం దూరంలో అతడి మొబైల్ ఫోన్ ముక్కలు ముక్కలుగా ఉన్నట్టు గుర్తించారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఫోన్ కాల్ సమాచారం సేకరించిన తరువాత వివరాలు తెలుస్తాయని అధికారులు పేర్కొన్నారు. సూసైడ్ నోట్ లభించలేదని అధికారులు పేర్కొన్నారు. ఆరు నెల క్రితం వాయు సేన జవాన్ జైదుత్ సింగ్ ఉరేసుకున్న సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం గ్వాలియర్‌లో జరిగింది. ఇది రెండో ఆత్మహత్య కావడంతో వాయుసేన అధికారులు అలర్టయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News