- Advertisement -
న్యూఢిల్లీ : పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని బాలకోట్‌లో ఉగ్రవాదుల స్థావరాలపై భారత సేనలు దాడులు జరిపి శనివారం నాటికి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా భారత వైమానిక దళం విన్యాసాలు నిర్వహించింది. ఆనాడు దాడిలో పాల్గొన్న పైలట్ల తో కలసి ఐఎఎఫ్ చీఫ్ ఆర్‌కె ఎస్ భదౌరియా ఈ విన్యాసాలు నిర్వహించారు. సుదూర పరిధి నమూనా లక్షాలపై బాంబుల దాడులు సాగించారు. 2019 ఫిబ్రవరి 14న జమ్ముకశ్మీర్ లోని పుల్వామాలో సిఆర్‌పిఎఫ్ జవాన్ల కాన్వాయ్‌పై ఉగ్రవాదులు జరిపినదాడిలో 40 మంది జవాన్లు అమరులయ్యారు. దీనికి ప్రతీకారంగా అదే ఏడాది ఫిబ్రవరి 27న బాలకోట్‌లో ఉగ్రవాదుల స్థావరాలపై భారత సేనలు దాడులు చేశాయి. దాదాపు 400 మంది ఉగ్రవాదులు మృతి చెంది ఉంటారని అంచనా.
- Advertisement -