Monday, December 23, 2024

గ్వాలియర్‌లో యువ ఐఎఎఫ్ అధికారి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

IAF officer commits suicide in Gwalior hostel

గ్వాలియర్: మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ నగరంలోని తన హాస్టల్ గదిలో సీలింగ్ ఫ్యానుకు ఉరేసుకుని ఒక 25 సంవత్సరాల భారతీయ వైమానికి దళానికి(ఐఎఎఫ్) చెందిన అధికారి ఆత్మహత్య చేసుకున్నారు. నగరంలోని మహారాజ్‌పుర ఎయిర్ బేస్ వద్ద ఇంజనీరింగ్ విభాగంలో ఫ్లయింగ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న జైదత్ సింగ్ బుధవారం ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. గుజరాత్‌లోని భావ్‌నగర్‌కు చెందిన జైదత్ ఈ ఏడాది జనవరిలో బదిలీపై గ్వాలియర్‌కు వచ్చినట్లు వారు చెప్పారు. మృతుని హాస్టల్ గదిలో సూసైట్ నోట్ ఏదీ లభించలేదని వారు చెప్పారు. ఉదయం 6 గంటలకు డ్యూటీలో రిపోర్ట్ చేయవలసి ఉండగా ఆయన తన గదిలో ఆత్మహత్య చేసుకున్నారని వారు తెలిపారు. జైదత్ సింగ్ అవివాహితుడని, సమాచారాన్ని ఆయన కుటుంబ సభ్యులకు తెలియచేశామని పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News