Monday, January 20, 2025

అగ్నిపథ్‌లో ఐఎఎఫ్‌కు 2 లక్షలకు పైగా దరఖాస్తులు..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: అగ్నిపథ్ పథకం కింద అగ్నివీరులుగా ఇండియన్ ఎయిర్‌ఫోర్సులో నియామకానికి సంబంధించి 2,01,000 అభ్యర్థులు రిజిస్టర్ చేసుకున్నారని కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి ఎ భరత్ భూషణ్ బాబు ట్విటర్ ద్వారా బుధవారం వెల్లడించారు. ఈ పథకంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూన్ 24న ప్రారంభమైంది. చివరి తేదీ జులై 5. కేవలం ఈ ఆరు రోజుల వ్యవధిలోనే రెండు లక్షలకు పైగా దరఖాస్తులు రావడం గమనార్హం. జూన్ 14న అగ్నిపథ్ పథకం అమలు లోకి వచ్చిన తరువాత వ్యతిరేకిస్తూ దేశం మొత్తం మీద ఆందోళనలు చెలరేగిన సంగతి తెలిసిందే.

IAF Receive 2 Lakh Applications in Agnipath

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News