- Advertisement -
న్యూఢిల్లీ: గత మార్చి 9న ప్రయోగించిన బ్రహ్మోస్ క్షిపణి ప్రమాదవశాత్తు పాకిస్థాన్‌లో పడిన సంఘటనకు సంబంధించి ఇండియన్ ఎయిర్ ఫోర్సు (ఐఎఎఫ్)కు చెందిన ముగ్గురు అధికారులను కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖ మంగళవారం తొలగించింది. ఈ సంఘటనపై జరిగిన కోర్టు ఆఫ్ ఎంక్వైరీలో నిర్ణీత ప్రమాణాల ప్రక్రియ నుంచి వైదొలగినట్టు బయటపడడంతో ఈ చర్య తీసుకుంది. ఇది సంబంధిత ఉద్యోగుల పూర్తి నిర్లక్షంగా పేర్కొంది. ఈ ముగ్గురు అధికారులు ప్రాథమికంగా ఈ ప్రమాదానికి బాధ్యులుగా తేలిందని, వారి సర్వీసులు కేంద్ర ప్రభుత్వం తక్షణం రద్దు చేస్తుందని రక్షణ మంత్రిత్వశాఖ ప్రకటించింది.
IAF Sacks 3 Officers for Misfire of Brahmos Missile
- Advertisement -