Saturday, January 18, 2025

నాపై లైంగిక దాడి చేశాడు: IAF ఆఫీసర్‌పై మహిళా అధికారిణి ఫిర్యాదు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: వింగ్ కమాండర్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని భారత వైమానిక దళానికి చెందిన మహిళా ఫ్లయింగ్ ఆఫీసర్ ఆరోపిస్తూ బుద్గామ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. డిసెంబరు 31, 2023న శ్రీనగర్‌లోని ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లోని ఆఫీసర్స్ మెస్‌లో జరిగిన న్యూ ఇయర్ పార్టీ తర్వాత వింగ్ కమాండర్‌పై తనపై బలవంతంగా లైంగికదాడికి పాల్పడ్డారని ఎఫ్‌ఐఆర్‌లో 26 ఏళ్ల మహిళా అధికారి ఆరోపించారు.

జనవరి 1వ తేదీ తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో వింగ్ కమాండర్ న్యూ ఇయర్ గిఫ్ట్ ఇస్తానని.. తన గదికి రావాలని చెప్పారని.. అక్కడికి వెళ్లిన తర్వాత గదిలో తనపై లైంగికదాడి చేశారని మహిళా అధికారి ఆరోపించారు. అప్పటి నుంచి నిరంతరం తనను లైంగిక వేధింపులకు వేధించారని.. మానసిక హింసకు గురిచేశారని ఫిర్యాదులో వాపోయారు. దీంతో సెంట్రల్ కాశ్మీర్‌లోని బుద్గామ్ పోలీస్ స్టేషన్‌లో వింగ్ కమాండర్ పై ఐపిసి సెక్షన్ 376(2) కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

“ఈ కేసు గురించి మాకు తెలుసు. ఈ విషయంపై స్థానిక బుద్గాం పోలీసులు.. శ్రీనగర్‌లోని ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌ను సంప్రదించింది. మేము ఈ కేసులో పోలీసులకు పూర్తిగా సహకరిస్తున్నాము” అని సీనియర్ IAF అధికారి తెలిపారు.కాగా.. శ్రీనగర్‌లోని ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో వింగ్ కమాండ్ తోపాటు బాధిత మహిళా ఆఫీసర్ విధులు నిర్వహిస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News