Thursday, January 23, 2025

మొరానా సమీపంలో కూలిన సుఖోయ్-30, మిరాజ్-2000

- Advertisement -
- Advertisement -

గ్వాలియర్: మధ్యప్రదేశ్‌లోని మొరానాలోని పహాడ్‌గఢ్‌లో భారత వాయుసేనకు చెందిన సుఖోయ్30, మిరాజ్-2000 శనివారం కూలిపోయాయి. ‘ఎయిర్‌ఫోర్స్ టీమ్ అక్కడికి చేరుకుంటోంది’ అని మొరానా అదనపు పోలీస్ సూపరింటెండెంట్ రాయ్ సింగ్ నర్‌వారియా తెలిపారు. ఈ ఘటనను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ కూడా ధ్రువీకరించి, రెస్కూ, రిలీఫ్ వర్క్‌లో వైమానిక దళానికి సహకరించమని స్థానిక అధికారులను ఆదేశించారు.
ప్రమాదానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియదని అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(ఎడిజిపి) ఆదర్శ్ కతియార్ పిటిఐ వార్తా సంస్థకు తెలిపారు. విమానాలు ఒకదాన్ని మరొకటి ఢీకొన్నాయా లేదా అనేది కూడా స్పష్టం కాలేదన్నారాయన.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News