Thursday, March 20, 2025

ఆమె తీరుతో నేనెంతో స్పూర్తి పొందా: ప్రియాంక చోప్రా

- Advertisement -
- Advertisement -

దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వంలో సూపర్‌స్టార్ మహేశ్‌బాబు హీరోగా ఓ భారీ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ‘ఎస్ఎస్ఎంబి29’ వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా చేస్తుంది. తాజాగా ఒడిషాలో ఈ సినిమా ఒక షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకుంది. షూటింగ్ తర్వాత చిత్ర యూనిట్ అక్కడ కొంతమందితో దిగి ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. అయితే ఈ షూటింగ్ పూర్తి చేసుకొని తిరిగి ఆమెరికా వెళ్తున్న ప్రియాంక చోప్రాకి ఓ ఆసక్తికర అనుభవం ఎదురైందట.

సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని వెళ్తున్న ఫోటోలను ప్రియాంక ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది. వాటితో పాటు ఆమె ఓ వీడియో కూడా షేర్ చేసింది. ఈ వీడియోలో ఆమె ఓ మహిళను చూసి ఎంతో స్పూర్తి పొందానని తెలిపింది. ‘విశాఖపట్నం ఎయిర్‌పోర్టు వద్ద నాకు జామపళ్లు విక్రయిస్తు ఓ మహిళ కనిపించింది. నాకు జామపళ్లు అంటే ఎంతో ఇష్టం. నేను ఆమెను ఆపి ఎంత అని అడిగితే.. రూ.150 అని చెప్పింది. నేను రూ.200 ఇచ్చి మిగిలిన డబ్బు ఉంచుకోమని చెప్పాను. ఆమెకు అదే జీవనాధారం అని నాకు తెలుసు. అయితే ఆమె అక్కడి నుంచి వెళ్లి.. కొంత సమయానికి తిరిగి వచ్చి ఇంకొన్ని పళ్లు ఇచ్చింది. ఆమె నిజమైన వర్కింగ్ ఉమెన్. సాయాన్ని ఆమె కోరుకోలేదు. అమె నా మనస్సు గెలుచుకుంది’ అంటూ ప్రియాంక పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News