Sunday, February 23, 2025

మద్యం మత్తులో ఐఎఎస్ అధికారి… బైక్ ను ఢీకొట్టిన కారు… పట్టించుకోని పోలీసులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఓ ఐఎఎస్ అధికారి హైదరాబాద్ లో మద్యం మత్తులో హిట్ అండర్ రన్ చేశాడు. స్థానికులు, బాధితులు నల్లకుంట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖకు చెందిన ఓ ఐఏఎస్ అధికారి మద్యం మత్తులో నల్లకుంట దగ్గర వేగంగా కారు నడిపి ఒక బైకును ఢీకొట్టాడు. బైక్ నడుపుతున్న వ్యక్తి కిందపడిపోయాడు. వాహనదారులు నిలదీయడంతో వారితో ఐఎఎస్ అధికారి దురుసుగా ప్రవర్తించాడు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో మద్యం బాటిళ్లు కూడా ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై మే 18న పోలీస్ స్టేషన్‌లో బాధితుడు ఫిర్యాదు చేసినా  పోలీసులు పట్టించుకోలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News