- Advertisement -
హైదరాబాద్ : పబ్లిసిటీ పిచ్చికి పనిష్మెంట్ లభించింది. అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న గుజరాత్‌లో ఎన్నికల పరిశీలకుడిగా విధులు నిర్వహిస్తున్న యుపి క్యాడర్‌కు చెందిన ఐఎఎస్ అధికారి అభిషేక్ సింగ్ ను ఎన్నికల కమిషన్ ఎన్నికల విధుల నుండి తొలగించింది. ఆయన చేసిన నేరం సోషల్ మీడియాలో తన ఫొటోలు ఉంచడమే. పబ్లిసిటీ కోసం ఆయన చేసిన ఈ పనికి ఎన్నికల కమిషన్ విధుల నుండి తొలగించి శిక్ష వేసింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఆ అధికారి ఎన్నికలకు సంబంధించిన ఎలాంటి విధులు నిర్వర్తించరాదని ఎలక్షన్ కమిషన్ పేర్కొంది.
- Advertisement -