Thursday, January 23, 2025

రాష్ట్రంలో పలువురు ఐఎఎస్ అధికారుల బదిలీలు

- Advertisement -
- Advertisement -

IAS officers transfer in Telangana

మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్రంలో పలువురు ఐఎఎస్‌లను బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. అదనపు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ డా. జ్యోతి బుద్ద ప్రసాద్‌ను బదిలీ చేసి చేనేత, జౌళి శాఖ కార్యదర్శిగా నియమించింది. రవాణా శాఖ కమిషనర్‌గా ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించింది. ఐఎఎస్ అధికారి రాహుల్ బొజ్జాకు రిజిస్ట్రేషన్, స్టాంపులు, కమిషనర్‌గా, సర్వే సెటిల్మెంట్ ల్యాండ్ రికార్డు కమిషనర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది. ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమ కమిషనర్ వి.కరుణ ను బదిలీ చేసి విద్యాశాఖ కార్యదర్శిగా నియమించింది.

హెచ్ ఎం అండ్ ఎఫ్ డబ్లు కార్యదర్శి సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వికు ఔషధ నియంత్రణ సంచాలకులుగా , ప్రజారోగ్యం కుటుంబ సంక్షేమ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది. ముఖ్యమంత్రి కార్యదర్శి వి. శేషాద్రి కి జిఎడి కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాకు యువజన సర్వీసులు, పర్యాటక శాఖ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News