Monday, January 20, 2025

పాలన.. ప్రక్షాళన

- Advertisement -
- Advertisement -

విపత్తుల శాఖకు అర్వింద్ కుమార్ బదిలీ

సీనియర్ అధికారి దాన కిషోర్‌కు పురపాలక శాఖ అప్పగింత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీగా బుర్రా వెంకటేశం జల మండలికి
సుదర్శన్ రెడ్డి, వైద్యారోగ్య శాఖ కార్యదర్శిగా క్రిస్టీనా జిఎడికి రాహుల్ బొజ్జా.. మహిళా, శిశు సంక్షేమ శాఖకు వాకాటి కరుణ
నల్గొండ కలెక్టర్ కర్ణన్ బదిలీ.. వైద్యారోగ్య శాఖ డైరెక్టర్‌గా నియామకం మరికొందరు సీనియర్ అధికారులపై త్వరలో వేటు?

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనలో భారీ ప్రక్షాళనకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శ్రీకారం చుట్టా రు. ఎన్నోఏళ్లుగా ఒకే పోస్టులో పాతుకుపోయిన సీనియర్ ఐఎఎస్ అధికారులను బదిలీ చేయడమే కాకుండా గత ప్ర భుత్వంలో చక్రంతిప్పిన అధికారులను అప్రదానమైన(లూప్‌లైన్) పోస్టులకు బదిలీ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. అంతేగాక కీలకమైన విభాగాలన్నింటిలో కొద్దిమంది ఐఎఎస్ అధికారులే పోస్టింగ్‌లలో కొనసాగుతూ మరికొంతమంది సమర్థులైన అధికారులను అప్రదానమైన పోస్టుల్లో కొనసాగిస్తూ వచ్చిన వైనం, గత ప్రభుత్వం మరికొందరికి పోస్టింగ్‌లే ఇవ్వలేదని, అలాంటి వారి సేవలను ఉత్తమంగా వినియోగించుకోవాలని భావిస్తున్నారు. ఓ నలుగురు రిటైర్డ్ ఐఎఎస్ అధికారులకు కూడా యథావిధిగా ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాల్లోనే పదవీ కాలాన్ని పొడిగించిన గత ప్రభుత్వ నిర్ణయాలు, ఉత్తర్వులను కూడా రద్దుచేసే దిశ గా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి యోచిస్తున్నట్లు సమాచారం.

గత ప్రభుత్వ హయాంలో కొందరు ఐఎఎస్‌లు లు, ఎంపిలనే కాకుండా చివరకు మంత్రులను సైతం ఖాత రు చేయకుండా, అంతులేని అధికారాలతో వ్యవహరించిన ఉదంతాలు ఉన్నాయని, అలాంటి వారి నిర్వాకాలపైనా ము ఖ్యమంత్రికి వచ్చాయని, ఇప్పటికీ కొందరు బ్యూరోక్రాట్లు చేసిన అవినీతి, అక్రమాలపైన లిఖితపూర్వక ఫిర్యాదులు కూడా అందుతున్నట్లు తెలిసింది. వాటన్నింటి పై సిఎంకు కూడా స్పష్టమైన సమాచారం ఉన్నట్లు పలువురు అధికారులు చర్చించుకుంటున్నారు. అంతేగాక తెలంగాణ లో పుట్టిపెరిగిన ఈ ప్రాంత బిడ్డలకు కూడా అప్రదానమైన పోస్టుల్లో కూర్చోబెట్టిన వైనం కూడా సిఎం పరిశీలనకు వచ్చిందని, అలాంటి అధికారులకు తన ప్రభుత్వంలో న్యా యం చేసే దిశగా దృష్టి సారించారని సమాచారం. కొందరు సీనియర్లను తప్పిస్తే వారి స్థానాల్లో పోస్టింగ్‌లు ఇవ్వడానికి సమర్థులైన ఇతర ఐఎఎస్ అధికారుల కోసం రేవంత్‌తో పా టుగా డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తదితరులు అన్వేషిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. అధికారుల వ్యక్తిత్వం, వారికున్న విద్యార్హత లు, స్పెషలైజేషన్, గత ప్రభుత్వంతో వారికున్న అనుబం ధం.. వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకొని పో స్టింగ్‌లు ఇవ్వడానికి కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. అం దులో భాగంగానే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, హెచ్‌ఎండిఎ, సమాచారశాఖ కమిషనర్, ఆ శాఖ కార్యదర్శిగానూ అనేక పదవులు  నిర్వహిస్తూ వచ్చిన సీనియర్ ఐఎఎస్ అధికారి అర్వింద్ కుమార్‌ను బదిలీ చేయడమే కాకుండా అప్రాధాన్యమైన విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్‌గా పోస్టింగ్ ఇవ్వడంతోనే సిఎం రేవంత్ కొందరు సీనియర్ అధికారుల పట్ల తన వైఖరి ఎలా ఉండబోతోందన్నది తేటతెల్లం చేశారని అంటున్నారు.

అంతేగాక సీనియర్ ఐఎఎస్ అధికారి అయివుండి కూడా ఓఆర్‌ఆర్ టెండర్‌ను అప్పనంగా, అతి తక్కువ ధరలకు ఒక కంపెనీకి కట్టబెట్టారన్న ఆరోపణలు అర్వింద్ కుమార్‌పై ఉన్నాయి. ఆయన స్థానంలో కీలకమైన పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శిగా దానకిశోర్ ను నియమించారు. ఆయనకు హెచ్‌ఎండిఎ, సిడిఎంఎ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. అదే విధంగా బుర్రా వెంకటేశం ఉన్నత విద్యావంతుడు, నిజాయితీపరుడు, సేవాభావం ఉన్న వ్యక్తి అని, అయినప్పటికీ మొదట్నుంచీ బిసి సంక్షేమ శాఖకే పరిమితం చేశారని, అందుకే ఆయన సేవలను అత్యంత కీలకమైన విద్యారంగానికి వినియోగించుకోవాలనే ఉద్దేశ్యంతోనే విద్యాశాఖకు ప్రిన్సిపల్ సెక్రటరీగా పోస్టింగ్ ఇచ్చారని వివరించారు. కళాశాల, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌గా ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించారు. జలమండలి ఎండిగా సుదర్శన్ రెడ్డిని నియమించారు.

వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శిగా క్రిస్టినా, అర్ అండ్ బి శాఖ ముఖ్య కార్యదర్శిగా కెఎస్ శ్రీనివాసరాజు నియమితులయ్యారు. జిఎడి కార్యదర్శిగా రాహుల్ బొజ్జాను నియమించారు. ఎస్‌సి అభివృద్ధి శాఖ కార్యదర్శిగా ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించారు. అటవీ, పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శిగా వాణి ప్రసాద్‌ను నియమించారు. ఈపిటిఆర్‌ఐ డైరెక్టర్ జనరల్‌గా వాణిప్రసాద్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. మహిళా , శిశు సంక్షేమ శాఖ కార్యదర్శిగా వాకాటి కరుణ నియమితులయ్యారు. వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌గా టికె శ్రీదేవిని నియమించారు. నల్గొండ కలెక్టర్ ఆర్‌వి కర్ణన్‌ను బదిలీ చేసి వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా నియమించారు.

వీళ్లకు స్థాన చలనం తప్పదా..?

గత ప్రభుత్వంలో కీలకమైన పదవులను నిర్వర్తించిన పరిశ్రమలు, ఐటి శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్‌రంజన్, సిఎంఓ కార్యదర్శిగా, నీటిపారుదలశాఖలో అన్నీ తానై వ్యవహరించిన స్మితా సబర్వాల్ వంటి అధికారులపైన బదిలీ వేటుపడే అవకాశం పుష్కలంగా ఉందని తెలుస్తోంది. అంతేగాక ఈ ఇద్దరు అధికారుల వ్యవహారశైలి కూడా మంత్రివర్గంలోనే కాకుండా బ్యూరోక్రాట్లలో కూడా తీవ్ర చర్చనీయాంశమయ్యిందని, గత ప్రభుత్వంలో కీలకమైన బాధ్యతలు నిర్వర్తించినప్పటికీ కొత్తగా వచ్చిన ప్రభుత్వంలోని ముఖ్యమంత్రి, మంత్రులను కనీసం మర్యాదపూర్వకంగానైనా కలవాల్సిన ఐఎఎస్ అధికారులు ఆ పని చేయకుండా మొహంచాటేయడంపై పలువురు సీనియర్ అధికారులు కూడా తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. ఇక అత్యంత కీలకమైన సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ సిఎండిగా ఎనిమిదేళ్ళుగా పనిచేస్తున్న శ్రీధర్‌ను కూడా బదిలీ చేసే అవకాశాలున్నాయి. ఇక సందీప్‌కుమార్ సుల్తానియాను కూడా బదిలీ చేసే అవకాశాలున్నాయని, సుమారు ఏడు శాఖలను నిర్వహిస్తున్నారని, ఆయనకు బదిలీ తప్పదని తెలుస్తోంది.

ఆర్ధికశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె.రామకృష్ణారావు కూడా సుదీర్ఘకాలంగా అదే శాఖలో పనిచేస్తున్నారని, ఆయనను బదిలీ చేసినా ప్రముఖమైన శాఖలోనే పోస్టింగ్ ఇస్తారని, అలా కాకపోతే ఆర్ధికశాఖాధిపతిగానే కొనసాగించనూ వచ్చునని సమాచారం. విద్యుత్‌శాఖ స్పెషల్ సిఎస్‌గా పనిచేస్తున్న సునీల్‌శర్మ స్వయంగా తనను బదిలీ చేయాలని కోరినట్లుగా తెలిసింది. తాను హెచ్‌ఆర్‌డికి వెళుతున్నట్లుగా సునీల్‌శర్మ తన సన్నిహితులతో చెప్పినట్లు సమాచారం. పంచాయితీరాజ్ కమిషనర్‌గా పనిచేస్తున్న రఘునందన్‌రావు సహా మరికొందరు సీనియర్ ఐఎఎస్ అధికారుల బదిలీలు ఖాయంగా ఉంటాయని ప్రభుత్వ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇదే తరహాలో త్వరలో పోలీస్ శాఖలోని కొందరు సీనియర్ ఐపిఎస్ అధికారుల బదిలీలు, పోస్టింగ్‌లకు సంబంధించి కూడా ప్రత్యేక సమీక్షా సమావేశం ఉంటుందని సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News