Saturday, December 21, 2024

తెలంగాణలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం పలువురు ఐఏఎస్ అధికారులను శుక్రవారం బదిలీ చేసింది. సిద్దిపేట కలెక్టర్‌గా పనిచేస్తున్న ప్రశాంత్ జీవన్ పాటిల్ నీటిపారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శిగా బదిలీ అయ్యారు. సిద్దిపేట కొత్త కలెక్టర్‌గా మిక్కిలినేని మను చౌదరి నియమితులయ్యారు. ప్రస్తుతం మను చౌదరి కామారెడ్డి జిల్లాలో అదనపు కలెక్టర్‌గా ఉన్నారు. వరంగల్ మున్సిపల్ కమిషనర్‌గా ఉన్న షేక్ రియాజ్ బాషాను జనగాం జిల్లా కలెక్టర్‌గా బదిలీ చేశారు.

పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసుల శాఖల ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్న శైలజా రామయ్యర్‌కు అదనంగా రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి బాధ్యతలు అప్పగించారు. ఇప్పటి వరకు అదనపు హోదాలో ఈ బాధ్యతలను పర్యవేక్షిస్తున్న సునీల్ శర్మను ఈ బాధ్యతల నుంచి తప్పించారు. వరంగల్ జిల్లా కలెక్టర్ శివలింగయ్యను సాధారణ పరిపాలన శాఖకు నివేదించాలని ప్రభుత్వం ఆదేశించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News