Wednesday, May 14, 2025

స్మితా సభర్వాల్‌ vs తెలంగాణ ప్రభుత్వం.. మరో ట్వీట్ వైరల్

- Advertisement -
- Advertisement -

కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో ఫేక్ ఫోటోను రీట్వీట్ చేసినందుకు ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సభర్వాల్ కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. తాజాగా ఈ నోటీసులపై ఆమె స్పందిస్తూ..పోలీసులకు తన స్టేట్ మెంట్ ఇచ్చినట్లు తెలిపారు. “పోలీసులకు పూర్తిగా సహకరించా. చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా పోలీసులు అడిగిన ప్రశ్నలకు వివరణ ఇచ్చా. నేను రీ పోస్టు చేసినట్లే 2 వేల మంది చేశారు. వాళ్లందరిపైనా ఇలాంటి చర్యలే ఉంటాయా?. అలా చేయకపోతే కొంతమందినే టార్గెట్ చేసినట్లు అవుతుంది. అప్పుడు చట్టం ముందు అందరూ సమానులే అన్న సూత్రం రాజీపడినట్లు అవుతుంది” అని ఎక్స్ లో పోస్ట్ పెట్టారు.

కాగా, ఇటీవల కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాలను స్వాధీనం చేసుకోవాలని భావించిన రాష్ట్ర ప్రభుత్వం.. అక్కడ ఉన్న చెట్లను జేసిబిలతో తొలిగించేందుకు ప్రయత్నించింది. దీంతో హెచ్ సియు విద్యార్థులు ఆందోళనకు దిగారు. చెట్లను తొలిగించడంతో అక్కడున్న జింకలు, నెమలిలు బయటకు వస్తున్నాయని..మరికొన్ని చనిపోతున్నాయని వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వ్యవహారం జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ గా మారింది. అయితే, అవి నిజమైనవి కావని.. కొందరు కావాలనే ఏఐతో ఫేక్ ఫోటోలు, వీడియోలు తయారు చేసి సోషల్ మీడియాలో పెడుతున్నారని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు కేసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఇదిలా వుంటే.. తాము ఈ వ్యవహారంలో తీర్పు ఇచ్చే వరకు కంచ గచ్చిబౌలి భూముల్లో ప్రభుత్వం చేపట్టిన అన్ని పనులు ఆపివేయాలని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News