Wednesday, January 22, 2025

దానికి నేను బాధ్యురాలిని అవుతానా?: ఐఎఎస్ టికె శ్రీదేవి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తన బదిలీపై ట్విట్టర్‌లో ఐఎఎస్ అధికారి టికె శ్రీదేవి స్పందించారు. వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ పోస్టు నుంచి శ్రీదేవిని ఇసి బదిలీ చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం పర్యటనకు మూడు రోజుల ముందు బాధ్యతలు తీసుకున్నానని ఐఎఎస్ అధికారి శ్రీదేవి పేర్కొన్నారు. ఇటీవలే బాధ్యతలు తీసుకుంటే ఆ శాఖ పనితీరుకు తాను బాధ్యురాలిని అవుతానా? అని ప్రశ్నించారు.  రంగారెడ్డి, మేడ్చల్, యాదాద్రి. నిర్మల్ జిల్లాల కలెక్టర్లు, 13 మంది ఎస్పీలు, పోలీసు కమిషనర్లను బదిలీ చేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. రంగారెడ్డి కలెక్టర్ హరీశ్, మేడ్చల్ కలెక్టర్ అమోయ్ కుమార్, యాదాద్రి కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, నిర్మల్ కలెక్టర్ వరుణ్ రెడ్డి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్, వరంగల్ సిపి రంగనాథ్, నిజామాబాద్ సిపి వి.సత్యనారాయణ, రవాణాశాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు, వాణిజ్య పన్నులశాఖ కమిషనర్ టికె శ్రీదేవి, ఎక్సైజ్ శాఖ సంచాలకుడు ముషారఫ్ అలీతో పాటు తొమ్మిది జిల్లాల నాన్ కేడర్ ఎస్పీల బదిలీకి ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.  రాష్ట్రంలో ఎన్నికల నియమావళిని పకడ్భందీగా అమలు చేసే క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం పలువురు ఐఎఎస్, ఐపిఎస్ అధికారులను, ఉన్నతాధికారులను బదిలీ చేసినట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News